వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత్తిచ్చి రేప్, వీడియో రికార్డింగ్: బాధిత కుటుంబం గ్రామ బహిష్కరణ, రూ. 11వేల ఫైన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ యువతికి మత్తు మందిచ్చి అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను వీడియో తీసి బయటపెడతానని బాధితురాలిని బెదిరించాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామస్థులు వారిని సాంఘిక బహిష్కరణ చేశారు. అంతేకాదు బాధిత కుటుంబానికి రూ.11 వేల జరిమానా కూడ విధించారు.

మహిళలపై లైంగిక దాడులు చోటు చేసుకొన్న ఘటనలు రోజు రోజు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని రకాల చర్యలు తీసుకొన్నా కానీ, ఫలితం లేకుండా పోయింది.

రాజస్థాన్ రాష్ట్రంలో మాత్రం లైంగిక దాడికి గురైన యువతికే శిక్ష విధించిన ఘటన కలకలం రేపుతోంది. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడమే శాపంగా మారింది.

మత్తు మందిచ్చి రేప్

మత్తు మందిచ్చి రేప్

రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్‌ఘడ్‌కు చెందిన ఓ యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను నెట్‌లో పెడతానని బెదిరించి బాధితురాలిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు రోజుకు బాధితురాలిపై నిందితుడి వేధింపులు పెరిగిపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు చేయడమే బాధిత కుటుంబానికి తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెట్టింది.

బాధిత కుటుంబం గ్రామ బహిష్కరణ

బాధిత కుటుంబం గ్రామ బహిష్కరణ

అత్యాచారానికి గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామ పెద్దలకు కోపం వచ్చింది.ఈ విషయం తెలుసుకొన్న గ్రామ పెద్దలు బాధిత కుటుంబంపై తీవ్ర ఆగ్రహన్ని ప్రదర్శించారు. బాధిత కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించారు. బాధితులకు ఎలాంటి సహయం చేయవద్దని కూడ ఆదేశించారు. కనీసం తిండి గింజలు కూడ ఇవ్వొద్దని కూడ ఆదేశించారు.

రూ.11 వేల జరిమానా విధింపు

రూ.11 వేల జరిమానా విధింపు

బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాదు గ్రామపంచాయితీ తీర్పును కూడ పాటించకపోవడాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబం రూ.11 వేల జరిమానాను విధిస్తూ గ్రామపంచాయితీ పెద్దలు తీర్మానించారు.

బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి

బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి

బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని రాజస్థాన్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు సుమన్ శర్మ జిల్లా ఎస్పీని ఆదేశించారు. అంతేకాదు బాధితురాలి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసిన గ్రామ పంచాయితీ పెద్దలను కూడ అరెస్ట్ చేయాలని మహిళా కమిషన్ అధ్యక్షురాలు సుమన్ శర్మ ఆదేశించింది.

English summary
A rape victim and her family in Rajasthan's Chittorgarh had to confront social shun after the victim declined to change her announcement in the court against the denounced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X