వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృంగారంకు అసలు నిర్వచనం చెప్పిన హాట్ హీరోయిన్: లైంగిక దాడుల నేపథ్యంలో..!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తన సినిమాల ద్వారా యువతను రెచ్చగొట్టడమే గాకా హింసను ప్రోత్సహిస్తోందంటూ ఓ వ్యక్తి ట్విటర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశాడు. హాథ్రస్ అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిన నేపథ్యంలో ఆ వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిపై స్వరభాస్కర్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇచ్చింది.

 స్వరభాస్కర్ వెబ్ సిరీస్ రాస్‌భారీ పై...

స్వరభాస్కర్ వెబ్ సిరీస్ రాస్‌భారీ పై...

స్వరభాస్కర్ ప్రస్తుతం రాస్‌భారీ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉండగా ఇదంతా అడల్ట్ కామెడీ తరహాలో ఉంది. దీనిగురించే బన్సాల్ అనే వ్యక్తి స్వరభాస్కర్‌కు ట్వీట్ చేశారు. దేశం మొత్తం స్వరభాస్కర్ వెబ్ సిరీస్‌ చూసి సిగ్గుతో తలదించుకుంటోందంటూ ట్వీట్ చేశాడు. రాస్‌భారీ లాంటి వెబ్‌ సిరీస్‌లు తీసి యువతను పక్కదోవ పట్టిస్తోందంటూ ఆ వ్యక్తి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆ వెబ్‌ సిరీస్‌లో పేరుకు మాత్రం మహిళలపై దాడులు పెరుగుతున్నాయనే కాన్సెప్ట్ ఉందికానీ మొత్తంగా చూస్తే శృంగారమే అధికంగా కనిపిస్తోందంటూ ట్వీట్ చేశాడు. అయితే స్వరభాస్కర్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా రిప్లయ్ ఇచ్చింది.

శృంగారంకు అత్యాచారంకు తేడా తెలుసుకోవాలి

ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో జరిగే సెక్స్ ఎప్పటికీ తప్పు కాదని బోల్డ్‌గా చెప్పింది. అది సహజం అని స్పష్టం చేసింది. ఇద్దరి వ్యక్తుల మధ్య ఏకాభిప్రాయంతో కూడిన శృంగారం జరిగితేనే నువ్వు పుట్టావంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. అత్యాచారం అనేది బలవంతం పెట్టి మహిళపై లైంగిక దాడి చేయడమని అది ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో జరిగేది కాదని స్వరభాస్కర్ వివరించింది. అత్యాచారం, ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో జరిగే శృంగారం అనే రెండిటి మధ్య ముందుగా తేడా తెలుసుకోవాలని సూచించింది.

నా సినిమాల వల్ల కాదు.. మీ మైండ్ సెట్ మారాలి

దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయంటే అది తాను తీస్తున్న సినిమాల వల్ల కాదని కామాంధుల మైండ్ సెట్, ఆలోచించే విధానంవల్ల జరుగుతున్నాయని స్వరభాస్కర్ మండిపడింది. అప్పుడప్పుడు బుర్రను ఉపయోగించండని ట్వీట్ చేసిన వ్యక్తి బన్సాల్‌కు స్వరభాస్కర్ క్లాస్ పీకింది. అయితే రాస్‌భారీ వెబ్ సిరీస్ పై ఆరోపణలు రావడం ఇది తొలిసారి కాదు. అంతకుముందు కూడా సీబీఎఫ్‌సీ ఛైర్మెన్ ప్రసూన్ జోషి కూడా ఇది అడల్ట్ కంటెంట్‌లా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. దీన్ని చూసే ప్రేక్షకులు ఓ సారి ఆలోచించాలని కూడా ఆయన కోరారు. అయితే ఆయనకు కూడా స్వర భాస్కర్ ట్వీట్ ద్వారా రిప్లయ్ ఇచ్చింది. ఒక సీన్ గురించి ప్రస్తావించిన సీబీఎఫ్‌సీ ఛైర్మెన్ ప్రసూన్ జోషికి సమాధానమిస్తూ చూసే విధానం మారాలని స్వరభాస్కర్ చెప్పారు. ఒక సీన్‌ చూసి మొత్తం సినిమా అలానే ఉంటుందనే నిర్ణయానికి రావడం పొరపాటవుతుందని స్వరభాస్కర్ చెప్పారు.

Recommended Video

హైదరబాద్ లో బాలికను రేప్ చేసిన రౌడీ షీటర్
 స్కూలు టీచర్ పాత్రలో హాట్‌గా స్వర భాస్కర్

స్కూలు టీచర్ పాత్రలో హాట్‌గా స్వర భాస్కర్

ఇదిలా ఉంటే ఈ వెబ్‌సిరీస్‌లో స్వరభాస్కర్ షానూ అనే ఒక స్కూలు టీచర్ పాత్ర పోషించింది. తన భర్త ఎప్పుడూ ఏదో ఒక పనిపై క్యాంపులకు వెళుతుంటాడు.ఈ క్రమంలోనే చాలా అందంగా ఉండే షానూపై స్థానికంగా నివాసం ఉండే అబ్బాయిలు పెళ్లయిన మగవారు కన్నేస్తారు. ఈమె కారణంగానే వారి భర్తలు, పిల్లలు పక్కదారి పడుతుండటం భార్యలకు తలనొప్పిగా మారుతుంది. ఈ కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ తీయడం జరిగింది. ఇందులో అడల్ట్ కామెడీ ఎక్కువగా ఉండటం శృతిమించిన శృంగారం సీన్లు ఉండటాన్నే బన్సాల్ అనే వ్యక్తి ట్వీట్ ద్వారా ప్రశ్నించాడు.

English summary
Actor Swara Bhasker has responded to a Twitter person who accused her current collection, Rasbhari, of corrupting younger minds
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X