వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బ్లడ్ వేరు: రక్తదానం చేయడానికి 500 కిలోమీటర్లు ప్రయాణించాడు..ప్రాణం నిలిపాడు!

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్: అతనిది రేర్ బ్లడ్.. బోంబే బ్లడ్ గ్రూప్. వైద్య శాస్త్రంలో ఈ తరహా బ్లడ్ గ్రూప్ ను హెచ్ హెచ్ గా పేరు పెట్టారు. ఏబీఓ బ్లడ్ గ్రూప్ గా పిలుస్తారు. నూటికి ఏ ఇద్దరు, ముగ్గురిలోనూ కనిపిస్తుంటుంది. అలాంటి అరుదైన రక్త గుణాన్ని కలిగిన ఓ వ్యక్తి.. రక్తదానం చేయడానికి 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. సకాలంలో ఆసుపత్రికి చేరుకోగలిగాడు. రక్తాన్ని దానం చేశాడు. ఓ మహిళ ప్రాణాన్ని నిలబెట్టాడు. ఆ వ్యక్తి పేరు.. దిలీప్ కుమార్ బారిక్. ఒడిశాలోని రూర్కేలాకు చెందిన వ్యక్తి. అతనిది బోంబే బ్లడ్ గ్రూప్. అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో..తరచూ రక్తదానం చేయడాన్ని అలవాటు చేసుకున్నాడు. ఆ అలవాటే ఓ మహిళ ప్రాణాన్ని నిలబెట్టింది.

ఆ బిడ్డ నాది .. కాదు నాది ... పసికందు కోసం స్నేహితుల ఫైట్, డీఎన్ఏ టెస్ట్‌కు బ్లడ్ శాంపిల్స్ ?ఆ బిడ్డ నాది .. కాదు నాది ... పసికందు కోసం స్నేహితుల ఫైట్, డీఎన్ఏ టెస్ట్‌కు బ్లడ్ శాంపిల్స్ ?

 హ్యామరేజ్ కు గురి కావడం వల్ల రక్త హీనత.

హ్యామరేజ్ కు గురి కావడం వల్ల రక్త హీనత.

గంజాం జిల్లా పత్రాపూర్ బ్లాక్ పరిధిలోని మెండసింగి గ్రామానికి చెందిన సబిత అనే మహిళకు అదే బ్లడ్ గ్రూప్ అవసరమైంది. నిండు గర్భిణి అయిన ఆమె కాన్పు కోసం ఈ నెల 12వ తేదీన బెర్హంపూర్ లోని మహారాజా కృష్ణ చంద్ర గజపతి (ఎంకేసీజీ) వైద్య కళాశాల, ఆసుపత్రిలో చేరారు. ప్రసవానికి ముందర, ప్రసవానంతరం ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే సబిత ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ తరువాత హ్యామరేజ్ కు గురయ్యారు. రక్తహీనతకు గురయ్యారు. అనారోగ్య కారణాలు తోడు కావడంతో చాలా రక్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

రూర్కేలాలో ఒకే ఒక్కరికి..

రూర్కేలాలో ఒకే ఒక్కరికి..

నిర్దేశిత ప్రమాణాల మేరకు శరీరంలో రక్తం లేకపోవడం వల్ల సబిత ప్రాణాపాయ స్థితిలో పడ్డారు. ఆమెది కూడా బోంబే బ్లడ్ గ్రూపే కావడంతో డాక్టర్లు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బెర్హంపూర్ లోని అన్ని బ్లడ్ బ్యాంకుల్లో విచారించినప్పటికీ.. బోంబే బ్లడ్ లభించలేదు. అదే సమయంలో రశ్మిత ప్రాణిగ్రాహి అనే డాక్టర్ దిలీప్ కుమార్ బారిక్ పేరును సూచించారు. అతనిది కూడా బోంబే బ్లడ్ గ్రూపే కావడంతో కుటుంబ సభ్యులు దిలీప్ కుమార్ తో ఫోనులో మాట్లాడారు. అత్యవసరంగా రక్తం అవసరమైందని వివరించారు.

11 గంటలకు పైగా ప్రయాణం..

11 గంటలకు పైగా ప్రయాణం..

దీనితో అతను అప్పటికప్పుడు రూర్కేలా నుంచి బెర్హంపూర్ కు ప్రయాణం అయ్యాడు. ఈ రెండు నగరాల మధ్య దూరం 500 కిలోమీటర్ల పైమాటే. సుమారు 11 గంటల సమయం పడుతుంది. అయినప్పటికీ దిలీప్ కుమార్ వెనుకాడలేదు. శనివారం తెల్లవారు జామున బెర్హంపూర్ కు చేరుకున్నాడు. నేరుగా ఎంకేసీజీ వైద్య కళాశాల, ఆసుపత్రికి వెళ్లాడు. రక్తాన్ని దానం చేశాడు. వెంటనే- దాన్ని సబితకు ఎక్కించడంతో సబిత తిరిగి మామూలు స్థితికి చేరుకున్నారు. రక్తదానం అనంతరం సబిత కుటుంబ సభ్యులు అతనికి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించగా..దిలీప్ కుమార్ నిరాకరించాడు. తనది అరుదైన బ్లడ్ గ్రూప్ కావడం వల్ల తరచూ రక్తదానం చేస్తుంటానని వెల్లడించారు. నిత్యం ప్రతి మూడో నెలలకోసారి తాను రక్తదానం చేస్తుంటానని తెలిపాడు. తరచూ రక్తదానం చేయడం వల్ల సంప్రదాయబద్ధమైన రోగాల నుంచి బయటపడొచ్చని చెప్పాడు. ఈ తరహా రక్తం తన పూర్వీకుల్లో ఒకరిద్దరికి మాత్రమే ఉందని, జన్యుపరంగా అదే రక్తం తనకు సంక్రమించినట్లు దీలీప్ కుమార్ అన్నాడు. అరుదైన రక్తం కావడం వల్ల ఎవరికి రక్తం అవసరం వచ్చినా వెనుకాబోనని, దీన్ని అలవాటుగా మార్చుకున్నానని చెప్పారు.

English summary
According to reports, a woman namely Sabita, wife of Narayan Raita of Mendasingi under Patrapur block was admitted to the MKCG Hospital on October 12 for delivery. Next day, she delivered a baby girl following surgery. However, she developed postpartum hemorrhage (heavy bleeding) after cesarean birth of her baby. Entire family was under stress even after being blessed with a baby girl as the mother was critical at the hospital. After blood-test it came to fore that the patient has a very rare type of blood ‘Bombay phenotype’ commonly known as ‘hh’ blood group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X