వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగిరే పామును చూశారా.. అటవీ అధికారులకు చిక్కిందిలా..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌ : పాములు నేలపై పాకుతుంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎగిరే పామును ఎప్పుడైనా చూశారా. ఇటు అటు కోతిలా గెంతే పామును ఎప్పుడూ చూడలేదు కదూ. ఈ వీడియోలో మీరు అలాంటి పామును చూడొచ్చు. అరుదైన జాతికి చెందిన ఈ పామును ఒడిశా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

భువనేశ్వర్‌కు చెందిన ఓ వ్యక్తి ఎగిరే పామును ఆడిస్తూ పొట్టపోసుకుంటున్నాడు. అరుదుగా కనిపించే ఈ పాముతో రోడ్లపై విన్యాసాలు చేస్తూ జీవనోపాధిగా మలుచుకున్నాడు. అయితే ఆ నోట ఈ నోట ఫారెస్ట్ డిపార్టుమెంట్ అధికారులకు విషయం చేరడంతో వారు అప్రమత్తమయ్యారు. ఎట్టకేలకు అతడి ఆచూకీ తెలుసుకుని మంగళవారం నాడు ఆ పామును స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అతడిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే అరుదైన జాతికి చెందిన ఇలాంటి పాములను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు అధికారులు.

rare flying snake caught in odisha

సాధారణంగా ఇలాంటి ఎగిరే పాములు ఆగ్నేయాసియాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి విషపూరితమైనవని.. అయినా కూడా వాటివల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదట. కప్పలు, బల్లులు తదితర అల్ప జీవులను ఇవి ఆహారంగా తీసుకుంటాయట.

<strong>హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సీపీ ఆ వార్నింగ్‌ ఇవ్వడంలో ఆంతర్యమేంటి?</strong>హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సీపీ ఆ వార్నింగ్‌ ఇవ్వడంలో ఆంతర్యమేంటి?

ఇక ఆ యువకుడి నుంచి స్వాధీనం చేసుకున్న పామును అడవిలో వదిలేస్తామని చెప్పుకొచ్చారు అధికారులు. సాధారణంగా పాములను హింసించడం, వాటిని ఆడిస్తూ పొట్టపోసుకోవడం నేరమని చెబుతున్నారు అధికారులు. ఇలాంటి కేసుల్లో పట్టుబడ్డవారికి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నట్లు వెల్లడించారు.

English summary
A flying snake was seized from possession of a man in Bhubaneswar. He used to earn his livelihood by displaying the snake to public. City forest division incharge says "It's offence under Wildlife Protection Act.We're investigating. We'll release it in forest"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X