వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్‌ మహల్ వివాదం: చిచ్చుపెట్టిన సంగీత్ సోమ్.. ఆజ్యం పోసిన అజాంఖాన్

ప్రముఖ కట్టడాల జాబితాల నుంచి తాజ్‌ మహల్ తొలగింపు అంశంపై బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవక ముందే మరో నేత దానికి కొనసాగింపు వ్యాఖ్యలు చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లక్నో : ప్రముఖ కట్టడాల జాబితాల నుంచి తాజ్‌ మహల్ తొలగింపు సంగతేమోగానీ ప్రస్తుతం ఈ విషయంలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవక ముందే మరో నేత దానికి కొనసాగింపు వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రిగా ఆదిత్యానాథ్‌ ఆరు నెలల పాలన పూర్తి అయిన సందర్భంలో యూపీ ప్రభుత్వం ఓ బుక్‌లెట్ విడుదల చేయగా.. అందులో పర్యాటక ప్రాంత జాబితా నుంచి తాజ్‌ మహల్‌ను తొలగించారు. దీనిపై తీవ్ర విమర్శలు వినిపించగా... ప్రభుత్వానికి మద్దతుగా ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రేపాయి.

 Rashtrapati Bhavan, like Taj Mahal, is a sign of slavery, it too should be destroyed: SP's Azam Khan

''వారసలు ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు? తాజ్‌ మహల్‌ కట్టించిన షాజహాన్‌ తన తండ్రిని చెరసాలలో వేశారు. మొత్తం హిందువులే లేకుండా చేయాలని కుట్ర చేశారు. ఇలాంటి వాళ్లు మన చరిత్ర భాగస్వాములవడం చాలా విచారకరం. చరిత్ర మార్చాల్సిన అవసరం ఉంది..' అని సంగీత్‌ సోమ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంగీత్‌ సోమ్‌ పెట్టిన చిచ్చుకు కొనసాగింపా అన్నట్లు ఇప్పుడు మరో నేత మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''ఒక్క తాజ్‌ మహలే కాదు.. పార్లమెంట్‌, ఎర్రకోట, రాష్ట్రపతి భవన్‌ వాటిని కూడా వారసత్వ జాబితా నుంచి తొలగించాలి..'' అంటూ కొత్త డిమాండును ఈయన తెరపైకి తీసుకొచ్చారు. ఈయనెవరో కాదు.. వివాదాల పుట్ట.. అజాం ఖాన్‌.

సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి అయిన అజాం ఖాన్‌ మంగళవారం ఓ మీడియాతో మాట్లాడుతూ... మొగలుల కాలంలో నిర్మితమైన కట్టడాలపై నిషేధం విధించాలని ఎప్పటి నుంచో తాను డిమాండ్‌ చేస్తున్నానని చెప్పారు.

''తాజ్‌ మహల్‌ ఒక్కటే కాదు.. జాతి సంపదలుగా చెప్పుకుంటున్న రాష్ట్రపతి భవన్‌, పార్లమెంట్, ఎర్రకోట, కుతుబ్‌ మినార్‌ ఇవన్నీ బానిసత్వానికి ప్రతీకలే. అలాంటప్పుడు వాళ్లు(యూపీ ప్రభుత్వం) వాటిని కూడా ప్రముఖ కట్టడాల జాబితా నుంచి తొలగించి కూల్చేయాల్సిందే..'' అని అజాం ఖాన్‌ వ్యాఖ్యానించారు.

English summary
UP BJP legislator Sangeet Som has found an unlikely ally in Samajwadi Party (SP) gadfly Azam Khan, who on Tuesday called for the destruction of "all reminders of slavery" like the Taj Mahal and Rashtrapati Bhavan. "We should destroy all reminders of slavery that reek of those who once ruled over us. I've said this before too. Parliament, Qutab Minar, Rashtrapati Bhavan, Red Fort, Agra's Taj Mahal...all of it," said Khan, a former UP minister. It was unclear if Khan was being sarcastic or serious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X