వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోగి కన్నును కొరికిన ఎలుకలు: సిబ్బంది నిర్లక్ష్యమేనన్న పేరేంట్స్, కొట్టిపారేసిన ఆసుపత్రి,,

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని కొరికి ఎలుకలు గాయపర్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.ఈ ఘటన ఏప్రిల్‌ 23న చోటు చేసుకొంది. కోమాలో ఉన్న రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని రోగి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ముంబైలోని బాల్‌ఠాక్రే ట్రామా కేర్ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న రోగిని ఎలుకలు కొరికి గాయపర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రోగి తండ్రి గుప్తా మార్చిలో ఆయన కుమారుడు పరమిందర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.

Rat chews on comatose patients eye in Mumbai hospital

మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్ర చికిత్స చేసినా కుమారుడి పరిస్థితిలో మార్పులు రాలేదు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్ర చికిత్స చేసినా కుమారుడి పరిస్థితిలో మార్పులు రాలేదు.

40 రోజులు గడిచినా కూడ పరిస్థితిలో మార్పులు రాలేదు. ఏప్రిల్ 21న వైద్యులు కోమాలో ఉన్న కుమారుడిని జనరల్ వార్డుకు తరలించారని ఆయన గుర్తు చేశారు. జనరల్ వార్డులో ఎలుకలు సంచరించిన విషయాన్ని తాను చూసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

తన కుమారుడి కంటి నుండి రక్తం దారగా వస్తున్న విషయాన్ని గమనించి దగ్గరకు వెళ్ళి చూస్తే తన కొడుకు కంటిని ఎలుకలు కొరికిన గుర్తులు కన్పించాయని చెప్పారు.

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకొందని రోగి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. తమ ఆసుపత్రిపై బురద చల్లేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

English summary
A comatose patient's eye was allegedly nibbled on by a rat in Mumbai's civic-run Bal Thackeray Trauma Care Hospital in Jogeshwari.The patient's father also claimed that the incident took place on April 23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X