• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎలుకలు బాబోయ్.. అక్కడ భయపడటం లేదు.. కొనుక్కొంటున్నారు..!

|
  అక్కడ కిలో ఎలుకలు ధర 200 రూపాయలు || Rat Meat Sales In Kumbakonam Tamilnadu By Farmers || Oneindia

  చెన్నై : తంజావూర్ జిల్లాలోని కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ఎలుకల మాంసం విక్రయిస్తున్నారు కొందరు రైతులు. కరవు కాటకాలతో ఈసారి పంటలు సాగు చేయకపోవడంతో పొలాలు బీడుగా మారాయి. ఆ క్రమంలో ఎలుకల సంచారం ఎక్కువగా ఉండటంతో వాటిని పట్టుకుని అమ్మడం జీవనోపాధిగా మలుచుకున్నారు. పొలాల దగ్గర ఎలుకలను పట్టుకుని వాటిని మార్కెట్ ప్రాంతంలో అమ్ముతున్నారు. అయితే ఎలుకలను కొనేందుకు చుట్టుపక్కల జనం బాగానే వస్తున్నారట.

  జోరుగా ఎలుకల విక్రయం.. ఎగబడి కొంటున్న జనం

  జోరుగా ఎలుకల విక్రయం.. ఎగబడి కొంటున్న జనం

  కుంభకోణం ఏరియాలోని నిలత్తనల్లూర్. అవూర్ పరిసరాల్లో ఎలుక మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. 200 రూపాయలకు ఆరు ఎలుకలను విక్రయిస్తున్నప్పటికీ.. జనం బాగానే ఆదరిస్తున్నట్లు సమాచారం. రైతులు ఎలుకలు అమ్ముతున్నారనే విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామ ప్రజలు వాటిని కొనేందుకు ఎగబడుతున్నారట. అయితే పంట పొలాల్లో సంచరించే ఎలుకల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని అక్కడి ప్రాంత ప్రజలు నమ్ముతారట. అందుకే రైతులు అమ్ముతున్న ఎలుకలు కొనేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ధరతో సంబంధం లేకుండా రైతులు అడిగినంత ఇచ్చేసి ఎలుకలను ఇంటికి పట్టుకెళుతున్నారట.

  అమెజాన్ అడవులు కాలిపోతున్నాయి.. ఆక్సిజన్‌పై ఆందోళన.. యాక్టర్ మహేశ్ బాబు విచారం..! (వీడియో)

  అసోంలో ఎప్పటినుంచో.. భలే గిరాకీ..!

  అసోంలో ఎప్పటినుంచో.. భలే గిరాకీ..!

  అదలావుంటే అసోం ప్రజలు మటన్, చికెన్ కంటే కూడా ఎలుక మాంసానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అందుకే అక్కడ ఎలుక మాంసానికి భలే గిరాకీ ఉంటుంది. బాస్కా జిల్లా పరిధిలోని కుమారికటా ప్రాంతంలో ఆదివారం నాడు జరిగే సంతలో ఎలుక మాంసం అమ్మకాలు భారీగా జరుగుతాయనే ప్రచారం ఉంది. అక్కడ కిలో ఎలుకల ధర 200 రూపాయల పైచిలుకు ఉంటుందని సమాచారం. ఎలుకల మాంసం కొనేందుకు ఆదివారం నాడు జరిగే వారాంతపు సంతకు జనాలు పెద్దసంఖ్యలో క్యూ కడతారట. అక్కడి ప్రాంతంలో చిన్న చిన్న కుటుంబాలు చాలామటుకు ఎలుకల మాంసం అమ్మే చిరు వ్యాపారంపై ఆధారపడతాయి.

  వారంతపు సంతలో ఎలుక మాంసం.. కిలో 200 పైమాటే..!

  వారంతపు సంతలో ఎలుక మాంసం.. కిలో 200 పైమాటే..!

  చాలా ప్రాంతాల్లో మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు చూస్తుంటాం. కానీ అసోంలో మాత్రం అక్కడి వారంతపు సంతలో ఎలుకల మాంసం విక్రయం స్పెషల్ అన్నమాట. కిలో 200 రూపాయల పైచిలుకు ధర పలికే ఎలుక మాంసం కోసం అక్కడి జనాలు ఎగబడతారు. పోషకాలు ఉంటాయని నమ్మడమే గాకుండా చాలా రుచిగా ఉంటుందని స్థానికులు ర్యాట్ మీట్ కోసం క్యూ కడతారు. ఇతర ప్రాంతాల్లో సండే నాడు మటన్, చికెన్, ఫిష్ కోసం జనాలు ఎలా మార్కెట్లకు వెళతారో.. అదే మాదిరిగా అక్కడ ఎలుక మాంసం కొనేందుకు వారంతపు సంతకు ప్రత్యేకంగా వెళతారు.

  అదలావుంటే అసోంలో ఇదివరకు ఎప్పటినుంచో ఎలుక మాంసం వినియోగించడం చూస్తున్నాం. అయితే ఇటీవల తమిళనాడు తంజావూర్ జిల్లాలోని కుంభకోణం ఏరియాలో రైతులు ఎలుకలు అమ్మడం అనేది హాట్ టాపికయింది. అంతేకాదు ఆ ఎలుకల కోసం చుట్టుపక్కల జనాలు క్యూ కడుతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే పొలంలో తిరిగే ఎలుకల్లో ఔషధ గుణాలు ఉంటాయని వారు నమ్ముతారట. అందుకే రైతులు అమ్మే ఎలుకల కోసం జనాలు ఎగబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In Tamilnadu Thanjavur District kumbakonam area, after the cross cultivation, due to the lack of rain the cultivation of samba was stopped. The crop fields were left bare, where rat population was increasing. Farmers started selling the rats for meat on the streets as a form of alternative employment. Fascinatingly, the people are purchasing them with great interest.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more