వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హ్యాట్సాఫ్ : పూరీ రథయాత్రకు అనుమతి లభించిందంటే ఈ ముస్లిం యువకుడే కారణం.!

|
Google Oneindia TeluguNews

పూరీ జగన్నాథ రథయాత్ర అంటే ఒడిషాలోనే కాదు దేశవ్యాప్తంగా ఒక పెద్ద పండగ. ప్రతి ఏటా కొన్ని లక్షల సంఖ్యలో భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు. కానీ మాయదారి మహమ్మారి కరోనా ఈ యాత్ర శోభకు బ్రేక్ వేసింది. ఎంతో మంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్రలో ఈ సారి 500 మంది మాత్రమే కనిపించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రథయాత్రకు బ్రేక్ వేయాలంటూ ముందుగా సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలైంది. దీంతో ధర్మాసనం రథయాత్రకు బ్రేక్ వేస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ సారి మాత్రం కొన్ని నిబంధలతో రథయాత్ర వేడుక నిర్వహించొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ రివ్యూ పిటిషన్ వేసింది ఒక ముస్లిం యువకుడు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది.

పూరీ జగన్నాథ్ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి: కానీ, భక్తులు లేకుండానే..పూరీ జగన్నాథ్ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి: కానీ, భక్తులు లేకుండానే..

 సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన అఫ్తాబ్

సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసిన అఫ్తాబ్

ప్రపంచవ్యాప్తంగా పూరీ జగన్నాథ రథయాత్రకు మంచి గుర్తింపు ఉంది. కోవిడ్ -19 కారణంగా రథయాత్ర నిర్వహించరాదని సుప్రీంకోర్టు ముందుగా తీర్పునిచ్చింది. అయితే ఈ రథయాత్ర జరిగేలా మునపటి తీర్పుపై పునఃసమీక్షించాలంటూ అఫ్తాబ్ హుస్సేన్ అనే 19 ఏళ్ల ముస్లిం యువకుడు సుప్రీం తలపులు తట్టాడు. ఒడిషాలోని నయాగడ్‌కు చెందిన వాడు అఫ్తాబ్. ప్రస్తుతం అఫ్తాబ్ పేరు రాష్ట్రంలో మారుమోగుతోంది. అతన్ని రెండో సలాబేగాగా అక్కడి ప్రజలు పిలచుకుంటున్నారు. జగన్నాథుడిపై తనకున్న ప్రేమ ఇలా చాటాడని ఒడిషా ప్రజలు చర్చించుకుంటున్నారు.

 రెండో సలాబేగ్గా గుర్తింపు పొందిన అఫ్తాబ్

రెండో సలాబేగ్గా గుర్తింపు పొందిన అఫ్తాబ్

జూన్ 18న జగన్నాథ రథయాత్ర నిర్వహించరాదని అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీనిపై ముందుగా రియాక్ట్ అయ్యింది ఈ ముస్లిం యువకుడు అఫ్తాబ్ కావడం విశేషం. తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించాడు. బీఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న అఫ్తాబ్‌ను అక్కడి ప్రజలు రెండో సలాబేగాగ గుర్తిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ సలాబేగా ఎవరు..? మొఘల్ సుబేదార్ కుమారుడే సలాబేగ్. ఒడిషా కవుల్లో ఇతనికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంటే ముస్లిం అయినప్పటికీ జగన్నాథుడి కోసం అతని జీవితాన్ని అంకితం చేశాడు.

Recommended Video

Supreme Court - 'Middle Seats On Flights Must Remain Vacant After June 6'
 సలాబేగ్ సమాధి ముందు కాసేపు ఆగనున్న రథయాత్ర

సలాబేగ్ సమాధి ముందు కాసేపు ఆగనున్న రథయాత్ర

17వ శతాబ్దం తొలి అర్థభాగంలో సలాబేగ్ జీవించినట్లు చరిత్ర చెబుతోంది. కట్ చేస్తే మూడు కిలో మీటర్లు పాటు సాగే జగన్నాథుడి రథయాత్ర గ్రాండ్ రోడ్‌లోని సలాబేగ సమాధి దగ్గరకు రాగానే గౌరవార్థం కాసేపు ఆపడం జరుగుతుంది. ఆ తర్వాత రథయాత్రి తిరిగి ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉంటే జగన్నాథుడు తన జీవితంపై ప్రభావం చూపించాడని తన తాత ముల్తాబ్ ఖాన్ కూడా జగన్నాథుడి భక్తుడే అని పిటిషన్ దాఖలు చేసిన అఫ్తాబ్ చెప్పాడు. అఫ్తాబ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాక మరో 15 పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. 1960లో తన తాత బ్రహ్మ విష్ణు, మహేశ్వర త్రినాథుడి ఆలయాన్ని ఇతామతిలో నిర్మించారని గుర్తు చేశాడు.

English summary
Green signal was given to hold Puri jagannath Rathyatra by a SC. All thanks to A Muslim boy who had filed a Review petition regarding the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X