తీర్థప్రసాదాలుగా బంగారు, వెండి వస్తువులు, అక్కడికి వెళ్ళేందుకే ఖర్చు ఎక్కువ

మధ్యప్రదేశ్ లోని రత్లాం మహాలక్ష్మి ఆలయంలో దీపావళికి ముందు రోజు నుండి బంగారు, వెండి వస్తువులను తీర్థ ప్రసాదాలుగా భక్తులకు అందిస్తారు. ఈ ఆలయంలో భక్తులు అమ్మవారికి బంగారం, వెండి కానుకలే సమర్పిస్తారు. ఈ

మధ్యప్రదేశ్ :దేవుడి దర్శనానికి వెళ్ళే భక్తులకు ప్రసాదం, తీర్థం ఇస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ లోని ఓ దేవాలయంలో మాత్రం భక్తులకు బంగారం, వెండి వస్తువులను తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. చాలా కాలం నుండి ఈ ఆలయంలో ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

మధ్యప్రదేశ్ లోని రత్లాం లో మహాలక్ష్మి ఆలయం ఉంది. ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చినభక్తులు అమ్మవారికి బంగారం, వెండితో చేసిన వస్తువులను కానుకలుగా సమర్తిస్తారు. బంగారం, వెండి వస్తువులు ఆలయం నిండా ఉంటాయి.అయితే ఈ వస్తువులను దేవాలయ నిర్వాహకులు తిరిగి భక్తులకు ఇస్తుంటారు.

ratlam temple give to deevotes gold, silver gooods for prasadam

ప్రసాదంగా బంగారం, వెండి వస్తువులు

ఈ ఆలయానికి భక్తులు సమర్పించిన వెండి, బంగారు వస్తువులను తిరిగి ప్రసాదం రూపంలోనే భక్తులకు అందిస్తారు ఆలయ కమిటీ.ప్రతి ఏడాది దీపావళికి ముందురోజున వచ్చే ధంతేరస్ రోజున ఈ ఆలయానికి వచ్చేభక్తులకు బంగారం, వెండి వస్తువులను ప్రసాదంగా అందిస్తారు. ఆలయంలో ఉన్న బంగారం, వెండి వస్తువులు అయిపోయే వరకు భక్తులకు తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు.

ఈ ఆలయం నుండి తీర్థ ప్రసాదాలుగా తీసుకొన్న వస్తువులను పూజ మందిరంలో ఉంచుకొంటారు భక్తులు. దీని వల్ల తమకు అన్ని రకాలుగా లాభం జరుగుతోందని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రసాదంగా భక్తులకు దొరికే బంగారం, వెండి వస్తువుల విలువ చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీటికోసం భక్తులు చాలా ఖర్చు చేసి ఈ ఆలయానికి వెళ్తుంటారు.తీర్థ, ప్రసాదాల రూపంలో దొరికిన బంగారు, వెండి ఆభరణాలతో తమకు ప్రయోజనం కలుగుతోందని భక్తుల విశ్వాసం. ఈ విశ్వాసమే వారిని ఈ ఎంత ఖర్చైనా భరించి దేవాలయానికి వెళ్ళాలా చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+