వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టుకు రవిప్రకాశ్ : ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Supreme Court కు... రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్!!

న్యూఢిల్లీ : ఫోర్జరీ, డేటా చోరీ అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని .. ముందస్తు బెయిల్ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.

ఫోర్జరీ కేసు ..

ఫోర్జరీ కేసు ..

టీవీ 9లో పోర్జరీ కేసుతో రవిప్రకాశ్ కేసు నమోదైంది. ఉద్యోగి సంతకం ఫోర్జరీకి పాల్పడ్డారని అలంద మీడియా రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసింది. ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రవిప్రకాశ్, శివాజీ, మూర్తిలపై అలంద మీడియా ఫిర్యాదు చేయగా .. అయితే టీవీ 9 ఫైనాన్సియర్ మూర్తి మాత్రం పోలీసుల విచారణకు హాజరయ్యారు. శివాజీ, రవిప్రకాశ్ స్పందించలేదు. దీంతో పోలీసులు రవిప్రకాశ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

 కేసులివీ ...

కేసులివీ ...

ఆలంద మీడియా పిర్యాదుతో రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్‌ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రెండుసార్లు సీఆర్‌పీసీ సెక్షన్ల 160, సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ క్రమంలోనే రవిప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదుచేసిన కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను సర్వోన్నత ధర్మసానం విచారణకు స్వీకరించింది.

కేవియట్ పిటిషన్ కూడా ..

కేవియట్ పిటిషన్ కూడా ..

తాము నోటీసులు ఇచ్చినా రవిప్రకాశ్ నుంచి స్పందన రాకపోవడంతో లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు, నౌకల్లో అలర్ట్ ప్రకటించారు. ఫోర్జరీ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించినందున మరోసారి వెళ్లినా ఫలితం లేదని .. సుప్రీంకోర్టు మెట్కెక్కారు రవిప్రకాశ్. దేశంలో సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంను దాటిన కోర్టులు లేవు. మరి రవిప్రకాశ్ పిటిషన్‌లో సర్వోన్నత న్యాయస్థానం ఏం చెబుతుందోననే ఉత్కంఠ కొనసాగుతుంది. ముందస్తు బెయిల్ ఇస్తే .. రవిప్రకాశ్‌కు ఊరట కలిగినట్టే. లేదంటో మరోసారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారో .. లేదంటో తెలంగాణ పోలీసులకు రవిప్రకాశ్ లొంగిపోతారో చూడాలి.

English summary
Former TV9 former CEO Ravi Prakash who is facing allegations of forgery and data theft has approached the Supreme Court for anticipatory bail. The petition alleged that he had filed unfair cases against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X