వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ధిక సంక్షోభంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న రవిశంకర్ ప్రసాద్

|
Google Oneindia TeluguNews

దేశంలోని ఆర్థిక మందగమనాన్ని బాలీవుడ్ సినిమాల కలెక్షన్లతో పోలుస్తూ.. విమర్శల పాలైన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆదివారంనాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకే రోజు 3 బాలీవుడ్ చిత్రాలు రూ.120 కోట్లు వసూలు చేశాయన్న తన వ్యాఖ్యలు వాస్తవానికి కరెక్టేనని ఆయన పేర్కొన్నారు. తాను మాట్లాడిన వాటిలో కొన్నింటీనే సోషల్ మీడియాలో వక్రికరించారని చెప్పారు. అయితే పూర్తి వీడీయో కూడ సోషల్ మీడియాలో ఉందని చెప్పారు.

Ravi Shankar Prasad has withdrawn his comment

మూడు సినిమాలు రూ.120 కోట్లు వసూలు చేయడం రికార్డని పేర్కొన్న ఆయన, తాను చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందని చెప్పారు. ముంబైలో నేను ఈ మాటలు చెప్పానన్నారు. . లక్షలాది మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తూ, గణనీయంగా పన్నులు చెల్లిస్తున్న చిత్ర పరిశ్రమను అభినందించేందుకే తాను ఆ విషయాన్ని ప్రస్తావించాను. ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం మోదీ సర్కార్ తీసుకుంటున్న పలు ప్రజానుకూల నిర్ణయాలను కూడ ప్రస్తావించానని అన్నారు.

దేశంలో నెలకొన్న ఆర్ధికమందగమనంపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే... భారత దేశంలో ఆర్దిక మందగమనం లేదని ఇందుకు సాక్ష్యం ఇటివల విడుదలైన సినిమాలే కారణమని వ్యాఖ్యానించారు. ఆక్టోబర్‌ 2న విడుదలైన మూడు సినిమాలు ఒక్కరోజే 120 కోట్ల రుపాయాలు వసూలు చేశాయని అన్నారు. ఆర్ధిక మందగమనం లేదనడానికి సినిమాల కలెక్షన్లే నిదర్శమని అన్నారు. ముంబయిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆర్ధిక మందగమనం గురించి స్పందించాలని కోరడంతో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు చెలరేగాయి.ప్రతి నేతలు ఆయన్ను టార్గెట్ చేశారు. సినిమాల నుండి వాస్తవ ప్రపంచంలోకి రావాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధి సైతం సెటైర్లు వేశారు..కాగా అక్టోబర్ రెండున జాతీయవ్యాప్తంగా విడుదలైన సైరా తోపాటు వార్, మరియు జోకర్ సినిమాలు విజయవంతంగా నడుస్తున్న విషయం తెలిసిందే.

English summary
Union Minister Ravi Shankar Prasad has withdrawn his yesterday's comment where he cited the box-office collections of three Bollywood movies and said the economy was in good shape
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X