వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం బహుగుణ రాజీనామా, హరీష్ రావత్‌కు అవకాశం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ రాజీనామా చేశారు. ఆయన శుక్రవారం ఉదయం తన రాజీనామా లేఖను గవర్నర్‌‍కు సమర్పించారు. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హరీష్ రావత్‌ను ఎన్నుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.

హరీష్ రావత్‌తో పాటు రాష్ట్ర మంత్రి ప్రీతమ్ సింగ్‌ల పేర్లు బహుగుణ తర్వాత రేసులో ప్రధానంగా వినిపించాయి. అయితే చివరగా హరీష్ రావత్‌కే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రిని మార్చే వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్, ఏఐసిసి ప్రధాన కార్యదర్సులు జనార్ధన్ ద్వివేది, అంబికా సోనీ, అంబికా సోనీలను కేంద్ర పరిశీలకులుగా పంపనున్నారు.

Rawat all set to take over as Uttarakhand CM

2012లో బహుగుణతో రావత్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడినా దానిని దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు బహుగుణ స్థానంలో ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సంభవించిన అకస్మిక వరదలు, పునరావాస కార్యక్రమాలు బహుగుణ నాయకత్వ నైపుణ్యానికి ప్రశ్నార్థకంగా మారాయి. బహుగుణను తొలగించాలంటూ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కాంగ్రెసు నేతలు గత ఆరు నెలలుగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకు వస్తున్నారు.

English summary
The decks have been cleared for union water resources minister Harish Rawat to take over as the next chief minister of Uttarakhand as incumbent Vijay Bahuguna has been asked to submit his resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X