వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదంతా తప్పుడు ప్రచారమే.. బ్యాంకుల మూసివేతపై తేల్చేసిన ఆర్బీఐ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై : ప్రభుత్వరంగ బ్యాంకులు మూసివేయనున్నట్టు వస్తున్న వదంతులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివరణ ఇచ్చింది. ఏ ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకును మూసివేసే ప్రసక్తి లేదని ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

'ప్రామ్ట్ కరెక్టివ్ యాక్షన్' (పీసీఏ) పేరుతో తాము చేపట్టనున్న కొన్ని చర్యల నేపథ్యంలో మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రభుత్వరంగ బ్యాంకులు మూసివేస్తున్నట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని, అయితే అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆర్‌బీఐ పేర్కొంది.

RBI denies Rumors on Closing down of Public Sector Banks

మరోవైపు కేంద్రం కూడా మీడియాలో వస్తున్న ఈ వదంతుల్లో ఎంతమాత్రం నిజం లేదని, పైగా ప్రభుత్వరంగ బ్యాంకుల బలోపేతానికి తాము యోచిస్తున్నట్టు కూడా తెలియజేసింది. ''బ్యాంకుల మూసివేత ప్రశ్నే లేదు. రూ.2.11 లక్షల కోట్ల రీక్యాపిటైలేజేషన్ ద్వారా పీఎస్‌బీలను మరింత బలోపేతం చేయనున్నాం. వదంతులు పుట్టించేవారిని నమ్మొద్దు. పీఎస్‌బీల సంస్కరణల రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నాం..'' అని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఓ ట్వీట్‌లో తెలిపారు.

పీసీఏ ఫ్రేమ్‌వర్క్ అంటే ప్రభుత్వరంగ బ్యాంకులు కస్టమర్లకు అందించే రోజువారీ సేవలను నిలువరించడం కాదని, డిసెంబర్ 2002 నుంచి పీసీఏ విధానం అమల్లో ఉందని, దానిని ఇప్పుడు మరింత మెరుగుపరచనున్నామని ఆర్బీఐ తన వివరణలో పేర్కొంది. తమ పర్యవేక్షణలో బ్యాంకులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయనున్నామని ఆర్బీఏ స్పష్టం చేసింది.

English summary
The Reserve Bank of India (RBI) today clarified that there was no question of closure of any public sector bank. Earlier, the decision of the Reserve Bank to initiate a ‘prompt corrective action’ (PCA) against large state-owned lender Bank of India led to rumours that the government may close down some banks. A press release issued by the Bank today said that “The Reserve Bank of India has come across some misinformed communication circulating in some section of media including social media, about closure of some Public Sector Banks in the wake of their being placed under the Prompt Corrective Action (PCA) framework. In this context attention is drawn to the press release issued on June 5, 2017, which stated as under:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X