వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శుభవార్త: ప్లాస్టిక్ తో పది రూపాయాల నోటు తయారీకి కేంద్రం అనుమతి

ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలా పది రూపాయాల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి వాటిని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వ్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండేలా పది రూపాయాల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా ముద్రించి వాటిని క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు రిజర్వ్ బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక సహయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్ సభలో ప్రకటించారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు గాను ఆయన లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని ప్రకటించారు.

RBI given the nod to conduct field trial of Rs. 10 plastic notes, says govt.

దేశంలోని ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్లతో క్టేత్రస్థాయిలో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్టుగా మంత్రి ఆ సమాధానంలో తెలిపారు. ప్లాస్టిక్ మిశ్రమాల సేకరణ వాటిపై పది రూపాయాల ముద్రణ లాంటి విషయంలో అన్ని అనుమతులను కేంద్రం రిజర్వ్ బ్యాంకుకు ఇచ్చిందని ఆయన చెప్పారు.

ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లను ఎక్కువ కాలం దెబ్బతినకుండా ఉండే అవకాశం ఉందని మంత్రి చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంకులు ప్రస్తుతమున్న నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ , ఇతర పదార్థాలతో చేసిన నోట్ల గురించి ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు.కరెన్సీ నోట్ల జీవితాన్ని పెంచే లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామని మంత్రి చెప్పారు.

English summary
The government on Friday said the Reserve Bank of India has been authorised to conduct a field trial of plastic notes of Rs. 10.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X