వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందులో ఏముంది?: ప్రధాని మోడీకి రాజన్ లేఖ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా తాను రెండోసారి కొనసాగాలనుకోవడం లేదని రఘురాం రాజన్ స్పష్టం చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీకి ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఓ లేఖ రాశారు.

సెప్టెంబర్‌తో ముగియనున్న తన పదవీ కాలం తర్వాత తిరిగి రెండోసారి ఆర్‌బీఐ గవర్నర్‌గా తాను కొనసాగాలనుకోవడం లేదని అందులో స్పష్టం చేశారని ఆనంద్ బజార్ అనే పత్రిక తన కథనంలో పేర్కొంది. అంతేకాదు తన పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన తిరిగి అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని పేర్కొంది.

అమెరికాకు చెందిన ఓ ప్రముఖ యూనివర్సిటీలో తాను భారతీయ ఎకానమీపై రీసెర్చ్ చేయాలనుకుంటున్నట్లు ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నట్టు తెలిపింది. ఇటీవల కాలంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి నిత్యం తనను టార్గెట్ చేస్తున్న తరుణంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

RBI governor Raghuram Rajan doesn't want extension: Media report

సెప్టెంబర్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ పదవీ కాలం పూర్తి కానుంది. అయితే ప్రధాని మోడీ మాత్రం రఘురాం రాజన్‌ను ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగించాలని కోరుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. చికాగో యూనివర్శిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పాఠాలు చెప్పే రాజన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా సేవలందించేందుకు సెలవు పెట్టిన సంగతి తెలిసిందే.

కాగా, ఇటీవలే భారత ఆర్ధిక వ్యవస్థను ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ నష్టాల బాట పట్టిస్తున్నారని, ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీకి రాసిన లేఖలో రాజన్ మానసికంగా ఆయన పూర్తి భారతీయుడు కాదని పేర్కొన్నారు.

<strong>సగం భారతీయుడు: తప్పించండంటూ రాజన్‌పై ప్రధాని లేఖ</strong>సగం భారతీయుడు: తప్పించండంటూ రాజన్‌పై ప్రధాని లేఖ

అమెరికా ప్రభుత్వం జారీ చేసిన గ్రీన్ కార్డును ఆయన రెన్యువల్ చేయించుకోవడమే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఉద్దేశ పూర్వకంగా భారత ఆర్ధిక వ్వవస్థకు నష్టం కలిగించేలా రాజన్ చర్యలు ఉన్నాయని అన్నారు. రాజన్ తీసుకున్ననిర్ణయాల వల్ల చిన్న, మధ్యతరహా వ్యాపారులు దెబ్బతిన్నాయని, దేశంలో నిరుద్యోగిత పెరిగిందని ఆయన ఆరోపించారు.

English summary
Reserve Bank of India Governor Raghuram Rajan has indicated that he doesn't want to remain in the position after his tenure ends in September, a media report said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X