• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాల్యా ఫైల్ ఇదీ: రైతులకేనా, కార్పోరేట్ల వర్తించవా?

By Swetha Basvababu
|

ముంబై / న్యూఢిల్లీ: పంట రుణ మాఫీ పథకం అమలుతో నైతిక ప్రమాణాలకు ముప్పుగా పరిణమిస్తుందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాకర్షక రుణ మాఫీ పథకం అమలు చేయడం వల్ల ద్రవ్యోల్బణం సమస్య తలెత్తడంతోపాటు నిజాయితీగా సాగే రుణ చెల్లింపుల ప్రక్రియను, సంస్కృతిని దెబ్బ తీస్తుందని వ్యాఖ్యానించారు.

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పంట రుణాలు మాఫీ చేయడంతోపాటు మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయాణం సాగిస్తున్న నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదే సమయంలో బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వ సలహాదారులు కూడా పదేపదే రైతులకు పంట రుణాలు మాఫీ చేయడం క్లిష్టతరమైన పరిస్థితులకు దారి తీస్తుందని చెప్తున్నారు.

కానీ కార్పొరేట్ సంస్థలకు వారు అడగక ముందే రుణాలు.. అందునా లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్న సంగతి.. ఉత్పాదకత సాధిస్తామని, ఉపాధి కల్పిస్తామని హామీలు గుప్పించి.. ప్రభుత్వ యంత్రాంగం వద్ద తెర వెనుక లాబీయింగ్.. అధినేతలతో సంప్రదింపులతో బ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకుని జల్సాలు చేస్తూ దివాళా తీస్తున్న సంస్థలు అనేకం.

విజయ్ మాల్య ఇలా

విజయ్ మాల్య ఇలా

అంతెందుకు లిక్కర్ బిజినెస్ మాగ్నెట్ గా పేరొందిన విజయ్ మాల్య అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు లండన్ పారిపోయి అక్కడ తల దాచుకున్న సంగతి అందరికీ తెలిసిన సత్యమే. అయితే పంట రుణాల మాఫీ అమలుపై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయానికి రావాలని ఉర్జిత్ పటేల్ సూచిస్తున్నారు. లేకపోతే ద్రవ్యపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. జాతీయస్థాయిలో జమాఖర్చులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

ఇలా యూపీ, పంజాబ్ కసరత్తు

ఇలా యూపీ, పంజాబ్ కసరత్తు

పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వాలు సంక్లిష్టమైన పంట రుణాల మాఫీ అంశ పరిష్కారానికి అవసరమైన చర్యలు, మార్గాలు అన్వేషిస్తున్నాయి. తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న రుణాలను రద్దు చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పనకు ఒక కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు పంజాబ్ ఆర్థికశాఖ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ తెలిపారు. పంట రుణాల చెల్లింపునకు దీర్ఘకాలిక సమయం పడుతుందని అంచనా వేశారు. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం గందరగోళం కొనసాగుతున్నది. ఎన్నికల ప్రచారంలో తాము గెలుపొందితే ప్రభుత్వం ఏర్పాటైన తొలి క్యాబినెట్‌లోనే రుణ మాఫీపై నిర్ణయం తీసుకుంటుందని యూపీ వాసులకు ప్రధాని మోదీ హామీనిచ్చారు. కానీ తొలి క్యాబినెట్ భేటీలో మాత్రం కేవలం రూ.లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ చేస్తామని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తమలో అసంత్రుప్తిని మిగిల్చిందని రైతులు తెలిపారు.

రుణ మాఫీపై కేంద్రమంత్రి జైట్లీ ఇలా..

రుణ మాఫీపై కేంద్రమంత్రి జైట్లీ ఇలా..

కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే పంట రుణాల మాఫీ భారాన్ని కేంద్రం భరించబోదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ భారాన్ని ఎలా భరిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ హాట్ టాఫిక్‌గా మారిన రుణ మాఫీ పథకం అమలు చేయడం ఎలా? అని పంజాబ్, యూపీ ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.

కార్పొరేట్లే ప్రభుత్వానికి ఇష్టులు ఇలా..

కార్పొరేట్లే ప్రభుత్వానికి ఇష్టులు ఇలా..

వ్యవసాయం రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోకి వస్తున్నదని వాదిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, అదే జాబితాలోనూ ఉన్న పరిశ్రమలకు చెందిన భారీస్థాయి రుణాలు మాఫీ చేయాల్సిన అవసరమే లేదు. కానీ పార్లమెంట్‌కు పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ (పీఏసీ) ప్రకటించిన నివేదిక ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద నిరర్ధక ఆస్తుల (రుణ బకాయిల) విలువ రూ.6.8 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ సంస్థల వాటా 70% అయితే రైతులు తీసుకున్న రుణాలు కేవలం ఒక్కశాతం మాత్రమేనంటే అతిశేయోక్తి కాదు.

కార్పొరేట్ రుణాలపై ఇండియా రేటింగ్స్ తీరిది..

కార్పొరేట్ రుణాలపై ఇండియా రేటింగ్స్ తీరిది..

క్రెడిట్ రేటింగ్ ఎజెన్సీ ‘ఇండియా రేటింగ్స్' పేర్కొన్న నివేదిక ప్రకారం సమీప భవిష్యత్‌లో రూ.4 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం రుణ మాఫీ చేయనున్నదని తెలుస్తోంది. ఆర్థిక ద్రుక్కోణంలోనే కార్పొరేట్ రుణాలను ప్రభుత్వం రద్దు చేస్తున్నదని వాదిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం.. ‘ఇది పెట్టుబడిదారి వ్యవస్థ పనితీరు' అని పేర్కొన్నారు. అదే మాట నిజమైతే రైతులకు కూడా ఇదే పెట్టుబడి వ్యవస్థ విధానం ఎందుకు వర్తించదని రాజకీయ, ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రాలపైనేనా రుణ భారం

రాష్ట్రాలపైనేనా రుణ భారం

ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కార్పొరేట్లు, రైతులను ప్రభుత్వం ఒకేలా చూడాల్సిన అవసరం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. 2012 - 2015 మధ్య కార్పొరేట్లు తీసుకున్న రుణాలు రమారమీ రూ.1.14 లక్షల కోట్ల మేరకు ప్రభుత్వం రద్దుచేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని పారిశ్రామిక రుణ భారాన్ని భరించాలని కేంద్రం కోరకపోవడమే ఆశ్చర్యకరం. ఇటువంటి పరిస్థితుల్లో పంట రుణాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రభుత్వ ఖజానా నుంచి భరించాలని కేంద్రం అభిప్రాయపడటం వెనుక ఆంతర్యమేమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

ఉక్కు క్యాపిటలిస్టులపై పీఎంవో వ్యూహం ఇది

ఉక్కు క్యాపిటలిస్టులపై పీఎంవో వ్యూహం ఇది

దేశంలోని ఉక్కు పరిశ్రమల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న రుణ భారం సమస్యను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దాదాపు ఉక్కు కంపెనీలకు చెందిన 40 బ్యాంకు ఖాతాలకు సంబంధించి పీఎంఓతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కొత్త ప్యాకేజీ ప్రకటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలియ వస్తున్నది. ఈ ఉక్కు సంస్థల రుణ భారం మొత్తం సుమారు రూ.1.5 లక్షల కోట్లు ఉండవచ్చునని అంచనా. ఇది ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని రైతుల పంట రుణాల భారం కూడా రూ.75 వేల కోట్ల లోపే ఉండటం ఆసక్తికర పరిణామం.

ఇదీ పరిశ్రమల లావాదేవీలు, రుణాలిలా..కేవలం భూషణ్ స్టీల్స్ సంస్థ రుణాలే రమారమీ రూ.44,478 కోట్లు. ఇది పంజాబ్ రాష్ట్ర రైతుల రుణ భారం రూ.36 వేల కోట్ల కంటే అధికం. ఇక జిందాల్ స్టీల్ అండ్ పవర్ సంస్థ రుణ భారం అక్షరాల రూ.44,140 కోట్లు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయ ప్రకటించిన రుణ మాఫీ పథకానికంటే ఎక్కువే సుమా. గమ్మత్తేమిటంటే భూషణ్ స్టీల్స్, జిందాల్ స్టీల్ కార్పొరేట్ కార్యాలయాలు ఢిల్లీలోనే పరివేష్టితమై ఉన్నాయి. ఈ రెండు సంస్థల రుణ భారాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచే భరించాలన్న ప్రతిపాదన కేంద్రం నుంచి వచ్చింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.30,500 కోట్ల రుణ మాఫీ పథకం అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నది. ఎస్సార్ స్టీల్ రుణ భారం రూ.34,929 కోట్ల కంటే మహారాష్ట్ర రైతుల పంట రుణాల భారం తక్కువగా ఉన్నది. ఎస్సార్ స్టీల్ రుణ భారాన్ని మాఫీ చేయాలని బ్యాంకులను కోరుతున్న కేంద్ర ప్రభుత్వం.. మహారాష్ట్ర రైతుల రుణ భారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని పేర్కొనడం ఎంత వరకు సబబని నిపుణులు, ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ పరిశ్రమల లావాదేవీలు, రుణాలిలా..కేవలం భూషణ్ స్టీల్స్ సంస్థ రుణాలే రమారమీ రూ.44,478 కోట్లు. ఇది పంజాబ్ రాష్ట్ర రైతుల రుణ భారం రూ.36 వేల కోట్ల కంటే అధికం. ఇక జిందాల్ స్టీల్ అండ్ పవర్ సంస్థ రుణ భారం అక్షరాల రూ.44,140 కోట్లు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయ ప్రకటించిన రుణ మాఫీ పథకానికంటే ఎక్కువే సుమా. గమ్మత్తేమిటంటే భూషణ్ స్టీల్స్, జిందాల్ స్టీల్ కార్పొరేట్ కార్యాలయాలు ఢిల్లీలోనే పరివేష్టితమై ఉన్నాయి. ఈ రెండు సంస్థల రుణ భారాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచే భరించాలన్న ప్రతిపాదన కేంద్రం నుంచి వచ్చింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.30,500 కోట్ల రుణ మాఫీ పథకం అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నది. ఎస్సార్ స్టీల్ రుణ భారం రూ.34,929 కోట్ల కంటే మహారాష్ట్ర రైతుల పంట రుణాల భారం తక్కువగా ఉన్నది. ఎస్సార్ స్టీల్ రుణ భారాన్ని మాఫీ చేయాలని బ్యాంకులను కోరుతున్న కేంద్ర ప్రభుత్వం.. మహారాష్ట్ర రైతుల రుణ భారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని పేర్కొనడం ఎంత వరకు సబబని నిపుణులు, ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.

కేవలం భూషణ్ స్టీల్స్ సంస్థ రుణాలే రమారమీ రూ.44,478 కోట్లు. ఇది పంజాబ్ రాష్ట్ర రైతుల రుణ భారం రూ.36 వేల కోట్ల కంటే అధికం. ఇక జిందాల్ స్టీల్ అండ్ పవర్ సంస్థ రుణ భారం అక్షరాల రూ.44,140 కోట్లు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయ ప్రకటించిన రుణ మాఫీ పథకానికంటే ఎక్కువే సుమా. గమ్మత్తేమిటంటే భూషణ్ స్టీల్స్, జిందాల్ స్టీల్ కార్పొరేట్ కార్యాలయాలు ఢిల్లీలోనే పరివేష్టితమై ఉన్నాయి. ఈ రెండు సంస్థల రుణ భారాన్ని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచే భరించాలన్న ప్రతిపాదన కేంద్రం నుంచి వచ్చింది.

మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.30,500 కోట్ల రుణ మాఫీ పథకం అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నది. ఎస్సార్ స్టీల్ రుణ భారం రూ.34,929 కోట్ల కంటే మహారాష్ట్ర రైతుల పంట రుణాల భారం తక్కువగా ఉన్నది. ఎస్సార్ స్టీల్ రుణ భారాన్ని మాఫీ చేయాలని బ్యాంకులను కోరుతున్న కేంద్ర ప్రభుత్వం.. మహారాష్ట్ర రైతుల రుణ భారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని పేర్కొనడం ఎంత వరకు సబబని నిపుణులు, ఆర్థిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.

సేద్యం ప్లస్ కూలీలెక్కడ వస్తారు?

సేద్యం ప్లస్ కూలీలెక్కడ వస్తారు?

రైతుల పంట రుణాలు, పరిశ్రమలు తీసుకున్న రుణాలు కలిపే వాటి మాఫీపై ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవడం సబబుగా ఉంటుందని విశ్లేషకుల మాట. ఇటు వ్యవసాయం, అటు పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో ఉన్నందున వాటి పట్ల కేంద్రం విభిన్నంగా వ్యవహరించడం సరి కాదని చెప్తున్నారు. నిజంగా పంటలు పండక రుణ భారంతో సతమతమవుతూ ఆందోళనకు గురవుతున్న రైతు ఉపశమనం కలిగించే పరిష్కార మార్గాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లవేళలా చూపడం కష్ట సాధ్యమే. కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులే కాదు సహకార బ్యాంకులు, సొసైటీల నుంచి తీసుకున్న రుణాలపైనా సమగ్ర ద్రుక్పథంతో వ్యవహరించాలని ఆర్థిక వేత్తలు, వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సహకార బ్యాంకులు, సొసైటీల రుణ భారం భరించే బాధ్యత జాతీయ వ్యవసాయ గ్రామీణాభివ్రుద్ది బ్యాంకు (నాబార్డ్) స్వీకరిస్తే మరింత సబబుగా ఉంటుందని సూచిస్తున్నారు. పారిశ్రామిక రుణాల మాఫీ విషయమై పీఎంవో ఏర్పాటు చేసినట్లే రైతుల పంట రుణాలపై తగు రీతిన స్పందించేందుకు పర్యవేక్షక గ్రూప్ ను ఏర్పాటు చేయాలని నిపుణులు కోరుతున్నారు.

English summary
RBI governor Urjit Patel says the populist farm loan waiver program set to be rolled out across Uttar Pradesh poses another risk for inflation, undermines an honest credit culture.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X