వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంచనాలకు అందలేదు: యథాతథంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు

|
Google Oneindia TeluguNews

ముంబై: భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) శుక్రవారం నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఎలాంటి కీలక వడ్డీ రేట్లపై ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగింది. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో 0.25శాతం మేర వడ్డీరేటును పెంచవచ్చని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు అంచనా వేశారు.

అయితే, ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య పరపతి విధాన కమిటీ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచేందుకు మొగ్గు చూపింది. ప్రస్తుతం రేపో రేటు 6.5శాతం వద్ద ఉండగా, రిజర్వ్ రేపో రేటు 6.25గానే ఉంది.

RBI keeps Repo Rate unchanged at 6.50%

ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీలో ఐదుగురు యథాపూర్వకస్థితిని కొనసాగించేందుకు ఓటు వేశారు. చేతన్ ఘాటీ మాత్రం వడ్డీ రేట్లను 0.25శాతం పెంచాలని ప్రతిపాదించారు.

ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాట్లాడుతూ.. ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ ద్రవ్యోల్బణం అదుపునకు సహకరిస్తుందని చెప్పారు.

English summary
Amid volatile economic situation due to falling Rupee, the Reserve Bank of India (RBI) on Friday kept the repo rate unchanged at 6.5 per cent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X