వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెన్సీ నోట్ల గుర్తింపు: కంటి చూపు లేనివారి కోసం ఆర్బీఐ ‘MANI’ యాప్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) కంటి చూపు సరిగా లేని వారి కోసం ఒక ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టింది. MANI(మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటీఫైయర్) అనే పేరుతో యాప్‌ను రూపొందించింది. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ యాప్‌ను ప్రారంభించారు.

ఆ రంగాల్లో తీవ్ర సంక్షోభం: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళనఆ రంగాల్లో తీవ్ర సంక్షోభం: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన

ఈ యాప్ సాయంతో కంటిచూపు లేని వారు సులువుగా నోట్లను గుర్తించే అవకాశం ఉంది. ఒకసారి మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే.. ఈ యాప్ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుందని ఆర్బీఐ అధికారులు వెల్లడించారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ వినియోగదారులు ఉచితంగానే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు

RBI launches new app for visually challenged to identify currency notes

ఈ యాప్ కెమెరా సాయంతో కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఇంగ్లీష్ ద్వారా సమాధానం ఇస్తుందని అధికారులు వివరించారు. అయితే, ఈ యాప్ కరెన్సీ నోటు అసలుదా? నకిలీదా? అనే విషయాన్ని మాత్రం తేల్చలేదని వెల్లడించారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తను నోట్లను రిజర్వు బ్యాంక్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మహాత్మా గాంధీ సిరీస్ పేరుతో సైజులు, డిజైన్లలో మార్పులు చేసి 2016 నవంబర్‌లో కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా మొదట రూ. 2000, రూ. 500 నోట్లను, ఆ తర్వాత రూ. 100, రూ. 50, రూ. 10, తాజాగా రూ. 20నోట్లను విడుదల చేసింది.

English summary
With an eye to aid the differently-abled, the Reserve Bank of India (RBI) on Wednesday launched a mobile app to identify currency notes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X