వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్ధిరేటు అంచనా తగ్గించిన ఆర్బీఐ

|
Google Oneindia TeluguNews

భారతీయ రిజర్వ్ బ్యాంక్ వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్ 7.4గా నమోదవుతుందని ఫిబ్రవరిలో ప్రకటించిన కేంద్ర బ్యాంకు ప్రస్తుతం ఆ అంచనాను 7.2 శాతానికి పరిమితం చేసింది. ఈ ఏడాది రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో ఆర్బీఐ వృద్ధి రేటు అంచనాను తగ్గించింది.

<strong>ఎన్నికల మహత్యం.. 2వేల నోటు మాయం..</strong>ఎన్నికల మహత్యం.. 2వేల నోటు మాయం..

దేశీయంగా పెట్టుబడులు తగ్గడం, మూలధన వస్తువుల ఉత్పత్తి తగ్గి దిగుమతులు పెరగడం జీడీపీపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. దీనికి తోడు ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక పరిణామాలు భారత ఎగుమతులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఫలితంగా అది వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటోంది. అయితే కమర్షియల్ సెక్టార్‌లో నిధుల వెల్లువ ఆర్థిక వ్యవస్థను ఒడిదొడుకులకు లోనుకాకుండా చూస్తుందని ఆర్బీఐ ఆశిస్తోంది.

RBI lowers GDP growth forecast to 7.2 percent for current fiscal year

ఆర్బీఐ ప్రస్తుత అంచనాల ప్రకారం 2019-20లో భారత వృద్ధి రేటు 7.2శాతం నమోదుకానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో జీడీపీ గ్రోత్ రేట్ 6.8 నుంచి 71 శాతం ఉండొచ్చని, రెండో అర్థభాగంలో మాత్రం 7.3 నుంచి 7.4 శాతంగా నమోదుకావచ్చని అంచనా వేస్తోంది. ఎల్‌నినో ప్రభావం, ద్రవ్యోల్బణం, ఆహార పదార్థాల ఉత్పత్తి, డిమాండ్‌పై వృద్ధి రేటు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

English summary
The Reserve Bank of India on Thursday lowered the GDP growth forecast for the current fiscal to 7.2 per cent from the earlier estimate of 7.4 per cent amid probability of El Nino effects on monsoon rains and uncertain global economic outlook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X