వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త వెయ్యి రూపాయాల నోటు ఇప్పట్లో లేనట్టే, నాలుగైదు వారాల్లో ఐదువందల కొత్త కరెన్సీ

కొత్త వెయ్యి రూపాయాల నగదు నోటును ప్రవేశపెట్టే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్ బి ఐ ప్రకటించింది.ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఐదువందల కొత్త కరెన్సీని నాలుగైదు వారాల్లో పెద్ద ఎత్తున ప్రజలకు అ

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబాయి: కొత్తగా వెయ్యి రూపాయాల నోటును ప్రవేశపెట్టే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్ బి ఐ ప్రకటించింది. నవంబర్ 8వ, తేదిన ఐదువందలు, వెయ్యి రూపాయాల నగదును రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. అయితే రద్దుచేసిన వెయ్యి రూపాయాల నగదు స్థానంలో కొత్తగా రెండువేల రూపాయాల నగదును ప్రవేశపెట్టారు. కాని, వెయ్యి రూపాయాల నగదును ప్రవేశపెట్టే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలదేని ఆర్ బి ఐ ప్రకటించింది.

 కొత్త ఐదువందల రూపాయాల నగదు

కొత్త ఐదువందల రూపాయాల నగదు

నవంబర్ 8వ, తేదిన ఐదువందలు, వెయ్యి రూపాయాల నగదును రద్దుచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో రెండు వేల రూపాయాల కొత్త కరెన్సీ ప్రస్తుతం మార్కెట్లో ఉంది. అయితే కొత్త ప్రవేశపెట్టిన ఐదువందల రూపాయాల నోట్లలో ముద్రణ లోపాలు ఉన్నట్టు గుర్తించి ఈ నగదును వెనక్కు తీసుకెళ్ళింది ఆర్ బి ఐ .దేశ వ్యాప్తంగా ఐదువందల నోట్ల కొరత ఏర్పడింది.ఐదువందల రూపాయాల కొత్త కరెన్సీ ప్రజలకు అందుబాటులో లేని కారణంగానే నగదు కష్టాలు ఎక్కువయ్యాయి. నెలరోజులు దాటినా ప్రజల డిమాండ్ కు తగ్గట్టుగా కరెన్సీ అందుబాటులో లేదు .దీంతో రానున్న మూడు, నాలుగు వారాల్లో పెద్ద ఎత్తున కొత్త ఐదువందల నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ నగదును ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

కొత్త వెయ్యి రూపాయాల నోటు ఇప్పట్లో లేదు.

కొత్త వెయ్యి రూపాయాల నోటు ఇప్పట్లో లేదు.

వెయ్యి రూపాయల నోటును రద్దుచేసిన తర్వాత కొత్త వెయ్యి రూపాయాల నోటును ప్రవేశపెట్టే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్ బి ఐ ప్రకటన చేసింది. ప్రస్తుతం కొత్త రెండువేల రూపాయాల నగదు మాత్రం అందుబాటులోకి వచ్చింది.అయితే వెయ్యి రూపాయల నోటు అందుబాటులో ఉంటే ప్రజల నగదు కష్టాలు ఇంకా త్వరగా తీరే అవకాశం ఉంది. అయితే కొత్త ఐదువందల రూపాయాల నోటు రానున్న నాలుగైదు వారాల్లో ప్రజల డిమాండ్ కు అనుగుణంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.అయితే వెయ్యి రూపాయాల నోటు మాత్రం ఇప్పట్లో ప్రవేశపెట్టే యోచన మాత్రం లేనట్టు తెలుస్తోంది.

 11 లక్షల కోట్ల పాత నోట్లు డిపాజిట్

11 లక్షల కోట్ల పాత నోట్లు డిపాజిట్

పెద్ద నగదు నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 11.55 లక్షల పాత నగదు బ్యాంకుల్లో డిపాజిట్ అయింది.ఏ మేరకు బ్యాంకుల్లో పాత నగదు డిపాజిట్ అయిందో అదే డిమాండ్ మేరకు కొత్త కరెన్సీని బ్యాంకులకు సరఫరా చేస్తున్నామని ఆర్ బి ఐ చెబుతోంది. అయితే ఆర్ బి ఐ చెబుతున్నట్టుగా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.అయితే కొత్త ఐదువందలు, రెండువేల రూపాయాల నగదును ఎక్కువ మొత్తంలో సరఫరాచేసేందుకు ముద్రణను వేగవంతం చేసింది ఆర్ బి ఐ

 4 లక్షల కోట్ల విలువ చేసే కొత్త కరెన్సీ సరఫరా

4 లక్షల కోట్ల విలువ చేసే కొత్త కరెన్సీ సరఫరా

పెద్ద నగదు రద్దుతో బ్యాంకుల్లో సుమారు 11.55 లక్షల కోట్ల నగదును డిపాజిట్ చేస్తే , బ్యాంకులకు ఇప్పటివరకు కేవలం 4 లక్షల కోట్ల విలువచేసే కొత్త నగదు కరెన్సీ చేరింది. ప్రజల డిమాండ్ కు అనుగుణంగా కొత్త కరెన్సీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్ బి ఐ ప్రయత్నిస్తోంది. కొత్తగా యాభై, ఇరవై. నోట్లను ముద్రించనున్నారు. నగదు కష్టాలు తీరిన తర్వాత ప్రజలు కోరుకొన్న మేరకు తమ ఖాతాల నుండి డబ్బులను డ్రా చేసుకొనే వెసులుబాటును కల్పించనుంది ఆర్ బి ఐ. నోట్ల రద్దుతో బ్యాలెన్స్ షీటుపై ఎలాంటి ప్రభావం లేదని ఆర్ బి ఐ ప్రకటించింది.

English summary
rbi not yet decission about new thousand rupees currency said rbi governor urjit patel,after november 8th til now around 11.55 lakhs ban currency deposited in banks, around 4 thousand crores of new currency will distrubuted banks said rbi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X