వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నోట్ల రద్దుకు ముందు కంటే ఎక్కువ కరెన్సీ నోట్ల ముద్రణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుకు ముందు కంటే కూడా భారత రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) కరెన్సీ నోట్ల ముద్రణ సంఖ్య, ముంద్రించే విలువను పెంచేసింది. నవంబర్ 8, 2016న రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు తర్వాత తొలిసారి కొత్త నోట్ల ముద్రణను పెంచడం గమనార్హం. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ మేరకు ఆర్బీఐ వెల్లడించింది.

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: కాశ్మీర్ కు ఆర్మీ చీఫ్: పాక్ కళ్లన్నీ ఆయన టూర్ మీదేసరిహద్దుల్లో యుద్ధ వాతావరణం: కాశ్మీర్ కు ఆర్మీ చీఫ్: పాక్ కళ్లన్నీ ఆయన టూర్ మీదే

2014-15లో ప్రింటింగ్ కాస్ట్ రూ. 3762కోట్లు కాగా, ముద్రించిన నోట్లు 2365, ఆ నోట్ల విలువ రూ. 4,30,404 కాగా, 2018-19లో ప్రింటింగ్ కాస్ట్ రూ. 4811 కోట్లు కాగా, ముద్రించిన నోట్లు 2919, ముద్రించిన నోట్ల విలువ రూ. 7,26,379కోట్లుగా ఉంది.

RBI’s presses print more notes than in pre-demo period

భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ పీవీటీ లిమిటెడ్(బీఆర్బీఎన్ఎంపీఎల్), సెక్యూరిటీ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్పీఎంసీఐఎల్)లు కేంద్ర బ్యాంక్ తరపున నోట్లను ముద్రిస్తున్నాయి. 2018-19లో 2,919.1కోట్ల నోట్లను ముద్రించింది. గత ఏడాది, 2016-17 కంటే కూడా ఇది ఎక్కువ పరిమాణం కావడం గమనార్హం.

2018-19లో ముద్రించిన కరెన్సీ విలువ రూ.7.26 లక్షలు కాగా, 2016-17లో ముద్రించిన కరెన్సీ నోట్ల విలువ రూ. 13.39లక్షల కోట్లుగా ఉంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ. 2000 నోట్లను ఆర్బీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అవే ఎక్కువ విలువ కలిగిన నోట్లు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్, నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు మోడీ ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. 2018-19లో ముద్రించిన బడిన కరెన్సీ నోట్ల విలువ 16.1శాతానికి పెరిగింది. ఇది భారత సాధారణ జీడీపీలో పెరిగిన 11.2శాతం కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఇక రూ.2000 కరెన్సీ నోట్ల విషయానికొస్తే.. 2016-17లో 350.4కోట్ల నోట్లను ముద్రించగా.. 2017-18లో 15.1కోట్ల నోట్లను మాత్రమే ముద్రించారు. ఇక గత ఆర్థిక సంవత్సరం 4.7కోట్ల నోట్లను ముద్రించింది.

2016-17లో 52.3శాతం రూ. 2000 నోట్లు ముద్రించగా.. 2018-19లో అది 1.3శాతానికి పడిపోయింది. పెద్ద నోట్ల రద్దుకు ముందు మార్చి 2016లో రూ. 16.415లక్షల కోట్లు చెలమణిలో ఉండగా.. మార్చి 2019 నాటికి అది రూ. 21.109లక్షల కోట్లకు చేరింది.

కొత్త బ్యాంక్ నోట్ల ముద్రణ ఖర్చును తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. కేంద్ర బ్యాంక్ రూ. 2,904కోట్ల రూపాయలను రూ. 7,956కోట్ల విలువైన నోట్ల ముద్రణకు వెచ్చిస్తోంది. అయితే, 2018-19లో మాత్రం రూ. 4,811కోట్లు ఖర్చుతో రూ. 2,919 కోట్ల నోట్లను సరఫరా చేసింది. రూ. 2000 నోట్ల ముద్రణను కొంత తగ్గించడం జరిగిందని తెలుస్తోంది.

గత ఆర్థిక సంవత్సరం నోట్ల ముద్రణపై ఖర్చు రూ. 4,912కోట్లతో పోలిస్తే.. జులై1, 2018 నుంచి జూన్ 30, 2019లో కరెన్సీ భద్రత ముద్రణపై రూ. 4,811 కోట్లు ఖర్చు అయినట్లు ఆర్బీఐ తెలిపింది. భారతీయ బ్యాంక్ నోట్ల జీవితకాలాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.

English summary
In other words, despite the Modi government’s emphasis on digital payments and a less-cash economy, the official printing presses are churning out more currency notes than before, both in volume and value terms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X