వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లి కూతురి తండ్రి ప్రశ్నకు ఆర్బీఐ సమాధానం ఇస్తుందా ?

భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు (రూ. 1,000, రూ.500) రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి ఇది ఓ చక్కటి ఉదాహరణ.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు (రూ. 1,000, రూ.500) రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి ఇది ఓ చక్కటి ఉదాహరణ.

పెళ్లికి బ్యాంకుల్లో రూ. 2.50 లక్షలు తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పటికే పెళ్లికి ముహుర్తాలు పెట్టుకున్న వారు, సంబంధాలు కుదుర్చుకున్న వారు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.

అయితే వారి సంతోషం ఎంత సేపు ఉండలేదు. పెళ్లికి డబ్బులు డ్రా చేసుకునే వారికి షరతులు వర్థిస్తాయని ఆర్బీఐ చెప్పడంతో వారి ఆనందం ఎంతో సేపు ఉండలేదు. ఇక బ్యాంకులకు వెళ్లిన వారు అధికారులు వేసే ప్రశ్నలతో విసిగిపోయి అధికారుల మీద మండిపడుతున్నారు.

పశ్చిమ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో రాజేంద్ర భరద్వాజ్ అనే ఆయన నివాసం ఉంటున్నారు. ఈయన తన కుమార్తె వివాహం డిసెంబర్ 2వ తేదీన చెయ్యడానికి అన్ని సిద్దం చేసుకుంటున్నారు.

RBI’s riders spoil the wedding party in New Delhi

పెద్ద నోట్లు రద్దు కావడంతో తన బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు తీసుకోవడానికి రాజేంద్ర భరద్వాజ్ ఇబ్బంది పడ్డారు. అయితే పెళ్లికి రూ. 2.50 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించడంతో ఆయన కొద్దిగా ఊపిరిపీల్చుకున్నారు.

వసంత్ కుంజ్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) దగ్గరకు వెళ్లారు. క్యూలో దాదాపు మూడు గంటల పాటు నిలబడి లోపలికి వెళ్లారు. అంతే బ్యాంకు అధికారులు డబ్బులు ఇవ్వడానికి వీలుకాదని చెప్పారు.

పెళ్లికి ఖర్చుపెడుతున్న అన్ని బిల్లులు ఇస్తే నగదు ఇస్తామని తేల్చి చెప్పారు. అంతే అంత వరకు ఓపికగా ఉన్న రాజేంద్ర భరద్వాజ్ అధికారుల మీద మండిపడ్డారు. నా కుమార్తె పెళ్లి కోసం నా అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి మీ షరతులు ఏంటి అని అధికారులను నిలదీశారు.

బావ కాళ్లు కడిగే సమయంలో బావమరిదికి ఇచ్చే కానుకలకు, ఆడపడుచులు హారతులు తీసే సమయంలో ఇచ్చే కానుకలకు రసీదులు కావాలంటే ఎలా ? అంటూ బ్యాంకు అధికారులను ప్రశ్నించారు.

హిందూ సాంప్రధాయంతో పెళ్లిలో ఆడే ఆటలకు ఎక్కడైనా రసీదులు ఇస్తారా అని అధికారులను ప్రశ్నించడంతో వారు నివ్వెరపోయారు. రాజేంద్ర భరద్వాజ్ అక్కడి అధికారులకు శాపనార్థాలు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

English summary
After standing in a queue outside a State Bank of India branch in south Delhi for three hours, Bharadwaj could not withdraw the money as he failed to fulfil certain conditions laid down by the RBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X