వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: రిజర్వ్ బ్యాంకు ఏర్పాటై 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ్ ఆర్ధిక వ్యవస్ధ బలంగా ఉండటంలో రిజర్వ బ్యాంకు పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

మన కరెన్సీ నోట్ల ముద్రణకు ఉపయోగిస్తున్న పేపర్, ఇంక్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, కనీసం రాబోయే కాలంలో మన దేశంలోనే ఉత్పత్తి అయ్యే పేపర్, ఇంక్‌ను కరెన్సీ నోట్ల ముద్రణకు ఉపయోగిస్తామో లక్ష్యాన్ని నిర్దేశించుకోలేమా అని ప్రశ్నించారు.

 కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

స్వదేశ్ ఉద్యమంతో దేశ స్వాతంత్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీ ఫోటోని విదేశాల్లోంచి దిగుమతి చేసుకున్న పేపర్‌పై ముద్రించడం సరికాదన్నారు. 'మేక్ ఇన్ ఇండియా' ను ఇక్కడ నుంచే ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. మన పేపర్, మన ఇంక్‌తో కరెన్సీని ముద్రించగలమన్న నమ్మకం నాకుందని ప్రధాని మోడీ అన్నారు.

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

పేదలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జన్ ధన్ యోజన కింద బ్యాంకుల్లో 14 వేల కోట్లు జమ అయినట్లు మోడీ తెలిపారు. ఆర్ధిక వృద్ధికి రానున్న 20 ఏళ్లలో ప్రణాళికలను రూపొందించాలన్నారు.

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

విద్యార్ధి విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఆశిస్తే, బ్యాంకులు వారికి సహకరించాలని, బ్యాంకులు ఖర్చు చేసిన ప్రతి పైసాను విద్యార్ధులు తిరిగి తీసుకొస్తారని మోడీ చెప్పారు.

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

ఇక కరెన్సీకి ఉపయోగించే పేపర్ తయారీకి సంబంధించిన పనలు చివరిదశలో ఉన్నాయని, త్వరలోనే భారత పేపర్, ఇంక్‌తో కరెన్సీ నోట్లను ముద్రిస్తామని ఆర్‌బీఐ గవర్నర్ ముంద్రా తెలిపారు.

 కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

ఆర్‌బీఐ తెలిపిన సమాచారం ప్రకారం ప్రతి ఏడాది ఆర్‌బీఐ 2,000 కోట్ల కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. అందులో 40 శాతం డబ్బులు కరెన్సీని ముద్రించినందుకు పేపర్, ఇంక్‌కే చెల్లిస్తున్నట్లు తెలిపారు.

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

కరెన్సీ ముద్రణలో మన పేపర్, మన ఇంకే వాడండి: మోడీ

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌లతో పాటు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ ఆర్‌బీఐ గవర్నర్లు పాల్గొన్నారు.

English summary
Prime Minister Narendra Modi wants the Reserve Bank to use Indian paper and ink to print currency notes and set a target date for achieving the objective as part of the 'Make In India' campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X