వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2వేలనగదు నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసిన ఆర్‌బిఐ

ఆర్‌బిఐ రూ.2వేల రూపాయాల నోట్ల ముద్రణను నిలిపివేసింది. కొత్తగా రూ. 200 నోటును తెచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ రూ.2వేల రూపాయాల నోట్ల ముద్రణను నిలిపివేసింది. కొత్తగా రూ. 200 నోటును తెచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.

పెద్దనోట్ల రద్దు తర్వాత కొత్త రూ.2వేల రూపాయాల నోటును ఆర్‌బిఐ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే అంతేకాదే కొత్త రూ.500 నోటును కూడ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ప్రస్తుతం చిన్న నగదుపై ఆర్‌బిఐ కేంద్రీకరిస్తోంది.

రూ.2వేల రూపాయాల నగదు నోటు ముద్రణను ఐదుమాసాల క్రితమే ఆర్‌బిఐ నిలిపివేసింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలకు నగదు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకుగాను కేంద్రం కొత్తగా రూ.2వేల నోటును తీసుకువచ్చింది.

RBI stops printing Rs 2000 notes, focus turns to new Rs 200 notes

అయితే పెద్దనోట్ల కారణంగా చిల్లర సమస్య తలెత్తింది. పెద్ద నగదు నోట్లు మార్కెట్లో చలామణి అవుతున్న తరుణంలో చిల్లర నగదు కోసం ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో చిన్న నగదు ప్రింటింగ్‌పై ఆర్‌బిఐ కేంద్రీకరిస్తోంది.

7.4 ట్రిలియన్ విలువగా గల 3.7 బిలియన్ రూ.2 వేల నగదు నోట్లను ఇప్పటివరకు ఆర్‌బిఐ ముద్రించింది. పెద్దనోట్ల నగదు సమయంలో 6.3 బిలియన్ల వెయ్యి రూపాయాల నోట్ల వెనక్కు తీసుకొన్నారు. దీని కంటే ఎక్కువేనని ఆర్‌బిఐ వర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి.

ప్రస్తుతం ప్రింట్ చేస్తున్న నగదు నోట్లలో ఎక్కువగా రూ.500 నోట్లే ఎక్కువగా ఉన్నాయి. 14 బిలియన్ రూ.500 నోట్లను ప్రింట్ చేశారు.

నవంబర్ 8వ, తేదినాటికి 7.85 ట్రిలియన్ విలువైన 15.7 బిలియన్ల రూ.500 పాత నోట్లు ఉండేవి. ప్రస్తుతం ప్రింట్ చేసిన కొత్త రూ. 500 నోట్లు కూడ దాదాపుగా దరిదాపుల్లోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

పెద్దనగదు నోట్ల రద్దు చేసిన ఎనిమిది మాసాల తర్వాత అంటే ఈ ఏడాది జూలై 14వ, తేది నాటికి దేశ వ్యాప్తంగా సుమారు 15.22 ట్రిలియన్ నగదు చలామణిలో ఉంది. అయితే గత ఏడాది నవంబర్ నాలుగవ తేది నాటికి సుమారు 17.7 ట్రిలియన్ నగదు మార్కెట్లో చలామణిలో ఉందని అధికారులు చెబుతున్నారు.

English summary
The Reserve Bank of India stopped printing 2,000-rupee notes about five months ago, stepping up instead the production of smaller bills, including a new Rs 200, people familiar with the matter said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X