వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేవింగ్స్ ఖాతాలపై ఆంక్షల ఎత్తివేతకు రంగం సిద్దం,డిజిటలైజేషన్ వైపు మళ్ళించాలి

సేవింగ్స్ ఖాతాలపై విధించిన ఆంక్షలను త్వరలోనే ఎత్తివేస్తామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ చెప్పారు. అన్ని రకాల ఆంక్షలపై సమీక్ష నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:సేవింగ్స్ ఖాతాలపై విధించిన ఆంక్షలను కూడ త్వరలో ఎత్తివేస్తామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు.ఇప్పటికే కరెంట్ ఖాతాలపై విధించిన ఆంక్షలను ఆర్ బి ఐ ఎత్తివేసింది.

పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఎటిఎం ల నుండి నగదు ఉపసంహరణపై ఆర్ బి పై ఆంక్షలను విధించింది. ఈ ఆంక్షలపై విడతలవారీగా ఎత్తివేస్తోంది ఆర్ బి ఐ

గత ఏడాది నవంబర్ లో కేంద్రం పెద్ద నగదునోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తర్వాత కొత్త కరెన్సీ కోసం ప్రజలు ఇబ్బందులుపడ్డారు.

కొత్తగా ప్రభుత్వం విడుదల చేసిన కరెన్సీ ప్రజల డిమాండ్ కు అనుగుణంగా మార్కెట్లోకి రాకపోవడంతో నగదు ఉపసంహరణపై ఆర్ బి ఐ ఆంక్షలను విధించింది.

నగదు ఉపసంహరణపై ఆంక్షల ఎత్తివేతకు రంగం సిద్దం

నగదు ఉపసంహరణపై ఆంక్షల ఎత్తివేతకు రంగం సిద్దం

బ్యాంకులు, ఎటిఎంల నుండి నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను దశలవారీగా ఆర్ బి ఐ ఎత్తివేస్తోంది.కరెంట్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. సేవింగ్స్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను కూడ ఎత్తివేసేందుకు రంగం సిద్దం చేసింది ఆర్ బి ఐ. సేవింగ్స్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను కూడ త్వరలోనే ఎత్తివేస్తామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ ప్రకటించారు.

ఆంక్షలపై సమీక్షించనున్న ఆర్ బి ఐ

ఆంక్షలపై సమీక్షించనున్న ఆర్ బి ఐ

సేవింగ్స్ ఖాతాలపై ప్రస్తుతం రూ.24 వేల రూపాయాలను ఉ,పసంహరణ చేసుకోనే అవకాశం కల్పించింది ఆర్ బి ఐ.అయితే సేవింగ్స్ ఖాతాలపై వారానికి రూ.24 వేల రూపాయాలను ఉపసంహరణ చేసుకొనే అవకాశం ఉంది.అయితే దీనిలో మార్పులు చేయలేదు.అయితే ఎటిఎం ల నుండి పదివేల రూపాయాలను సేవింగ్స్ ఖాతాల నుండి ఉపసంహరణ చేసుకొనే అవకాశం కలుగుతోంది.ఆంక్షలపై ఆర్ బి ఐ సమీక్ష నిర్వహించనుంది.అన్ని రకాల ఆంక్షలను సమీక్షించనుంది ఆర్ బి ఐ . ఈ సమీక్షతర్వాత ఆంక్షలను ఎత్తివేయనుంది ఆర్ బి ఐ.

ఆంక్షలు ఎందుకంటే

ఆంక్షలు ఎందుకంటే

పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత కొత్త కరెన్సీ ప్రజల డిమాండ్ కు అనుగుణంగా లేదు.దీంతో కొత్త కరెన్సీ కోసం ప్రజల డిమాండ్ కు సరఫరా చేసే పరిస్థితి ఆర్ బి ఐ వద్ద లేదు. ఆర్ బి ఐ ముద్రణ కార్యాలయాల్లో నిరంతంర పని జరిగినా ప్రజల డిమాండ్ కు అనుగుణంగా కొత్త కరెన్సీ మార్కెట్లోకి రాలేదు.దీంతో ఆర్ బి ఐ ఆంక్షలను విధించింది.

డిజిటలైజేషన్ వైపుకు ఖాతాదారులను మళ్ళించాలి

డిజిటలైజేషన్ వైపుకు ఖాతాదారులను మళ్ళించాలి

నగదు రహిత లావాదేవీల వైపుకు ఖాతాదారులను మళ్ళించాలని బ్యాంకులను ఆర్ బి ఐ ఆదేశించింది. కరెంట్ అకౌంట్లు, క్యాష్ క్రెడిట్ అకౌంట్లు, ఓవర్ డ్రాప్ట్ అకౌంట్ల నుండి నగదు ఉపసంహరణ పరిమితులను అన్నింటినీ ఆర్ బి ఐ తొలగించింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తోంది. ఇప్పటివరకు వారానికి రూ.లక్ష రూపాయాలను మాత్రమే ఉపసంహరణ చేసుకొనే పరిమితి ఉంది. ఇక నుండి ఈ ఖాతాల నుండి ఎంతైనా తీసుకొనే వెసులు బాటు కల్పించింది. మరో వైపు పేమెంట్ల విషయంలో డిజిటలైజేషన్ వైపు కస్టమర్లు నడిచేలా బ్యాంకులు తగిన ప్రయత్నాలు చేయాలని బ్యాంకుల్ని ఆర్ బి ఐ ఆదేశించింది.

English summary
rbi will be lift withdrawals limit on savings accounts said central finance secretary shaktikant das.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X