వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రూ.20 నోటు విడుదల, పాత నోటు కూడ చలామణి

కొత్త రూ.20 నోటును విడుదల చేయనున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఏర్పడిన చిల్లర కొరతను నివారించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆర్‌బిఐ వర్గాలు ప్రకటించాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: కొత్త రూ.20 నోటును విడుదల చేయనున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఏర్పడిన చిల్లర కొరతను నివారించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆర్‌బిఐ వర్గాలు ప్రకటించాయి.

మహాత్మాగాంధీ సిరీస్ 2005లో కొత్త రూ.20 బనోట్లను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్టు ఆర్‌బిఐ ప్రకటించింది.ఈ కొత్త నోట్లు నెంబర్ ప్యానెల్‌లో ఎస్ అనే ఇన్‌సెట్ లెటర్‌ను కలిగి ఉంటుందని ఆర్‌బిఐ తెలిపింది.

RBI will release new Rs 20 notes soon

అంతేకాదు ఈ నోటుపై ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుంది. ఈ మేరకు రిజర్వ్‌బ్యాంక్ బుదవారంనాడు ఓ ప్రకటనలో తెలిపింది. రెండు నెంబర్ ప్యానల్స్‌లో కూడ ఇన్‌సెట్ లెటర్ ఎస్ ఉంటుందని రిజర్వ్‌బ్యాంక్ ప్రకటించింది.

ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.20 నోట్ల మాదిరిగానే కొత్త నోటు కూడ అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని ఆర్‌బిఐ ప్రకటించింది. అంతకుముందు ఆర్‌బిఐ జారీచేసిన రూ.20 నోట్లను కూడ చట్టబద్దమైనవిగానే కొనసాగుతాయని ప్రకటించింది ఆర్‌బిఐ. 20 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత ఒక రూపాయి నోట్లను ముద్రించేందుకు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకొంది.

English summary
The Reserve Bank of India has said it will release new Rs 20 currency notes in the 2005 Mahatma Gandhi Series. The new notes will have the letter ‘S’ in both the number panels, the statement said. Older Rs 20 denomination notes will continue to be legal tender.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X