వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్.. అలర్ట్... ఢిల్లీ విమానాశ్రయంలో ఆర్డీఎక్స్ బాంబ్..? టెర్మినల్ 3 వద్ద వదిలివెళ్లిన దుండగులు.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ బ్యాగు కలకలం రేపింది. ఎయిర్‌పోర్టులోని పిల్లర్ నంబర్ 4 వద్ద బ్యాగును ఎవరో వదిలేసి వెళ్లిపోయారు. దానిని ఎవరూ తీసుకొనేందుకు ముందుకు రాకపోవడంతో అందులో ఏం ఉందో అనే అనుమానానికి దారితీసింది. బ్యాగు నల్లటి రంగులో ఉంది. అందులో పేలుడు పదార్థం ఉందా అని పోలీసులు భావిస్తున్నారు.

బ్యాగులో బాంబ్..?

బ్యాగులో బాంబ్..?

అర్ధరాత్రి 1 గంటలకు ఢిల్లీ పోలీసులకు అనుమానిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఎయిర్‌పోర్టులో ఆర్డీఎస్ ఉంది అని సదరు వ్యక్తి చెప్పారు. వెంటనే పోలీసులు ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. పిల్లర్ నంబర్ 4 వద్ద బ్యాగును చూసి నిర్ధారించుకున్నారు. ఒక్కసారిగా సిబ్బంది రావడంతో ప్రయాణికులు కంగారు పడిపోయారు. టెర్మినల్ 3 నుంచి బయటకువెళ్లే దారిని కాసేపు మూసివేశారు. 2 గంటలకు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు.

పేలుడు పదార్థం..?

పేలుడు పదార్థం..?

పిల్లర్ నంబర్ వద్ద నల్లని బ్యాగును స్వాధీనం చేసుకున్నామని.. కానీ అందులో ఆర్డీఎస్ ఉందని నిర్ధారణ కాలేదని సీఐఎస్ఎఫ్ డీజీ గణపతి మీడియాకు తెలిపారు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. వెంటనే ఘటనాస్థలానికి బాంబ్ తనిఖీ, నివారణ బృందం (బీడీడీఎస్) చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో ప్రయాణికుల వాహనాల రాకపోకలను కూడా నిషేధం విధించారు.

అలర్ట్.. అలర్ట్...

అలర్ట్.. అలర్ట్...

1.30 గంటల సమయంలో బీడీడీఎస్ సిబ్బంది చేరుకొని.. బ్యాగును పరిశీలించారు. ఎక్స్ రే ఇమేజ్ ఉన్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేసుకున్నారు. అయితే అందులో ఆర్డీఎస్ ఉన్నదని మాత్రం కచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు. ఆర్టీఎక్స్ ఉన్నదని ప్రాథమిక అంచనే తప్ప నిర్ధారణ కాదని ఉన్నతాధికారులు తెలిపారు. సీఐఎస్ఎఫ్ అధికారుల సాయంతో బ్యాగును తరలించామని.. అందులో ఎలక్ట్రిక్ వైర్ ఉన్నదని ఎయిర్ పోర్టు డీసీపీ సంజయ్ భాటియా పేర్కొన్నారు.

ప్రయాణికుల బెంబేలు

ప్రయాణికుల బెంబేలు

బ్యాగు తనిఖీ చేసేందుకు దాదాపు రెండుగంటల సమయం పట్టింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోకి అనుమతించారు. ఆ బ్యాగును 24 గంటలు పరిశీలిస్తామని అధికారులు చెప్పారు. అందులో ఆర్టీఎక్స్ లేదంటే ఐఈడీ బాంబ్ ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎలక్ట్రిక్ వైర్ ఉండటంతో బాంబ్ పెట్టారా అనే సందేహం కలుగుతుంది.

English summary
bag with suspected explosive was found at the Delhi airport in the early hours of Friday, leading to restrictions in passenger movements for a couple of hours, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X