వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఔరంగజేబు హత్య, ప్రతీకారం కోసం 50మంది విదేశాల్లో ఉద్యోగాలు వదిలేసి వచ్చారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఔరంగజేబు మృతితో రక్తం ఉడుకుతుంది అంటున్న యువత

శ్రీనగర్: కొద్ది నెలల క్రితం ఆర్మీ జవాన్ ఔరంగజేబును మిలిటెంట్ల దారుణంగా చంపిన విషయం తెలిసిందే. రంజాన్ సందర్భంగా సెలవులపై ఇంటికి వెళ్తున్న ఔరంగజేబును ఉగ్రవాదులు అపహరించి అత్యంత పాశవికంగా చంపేశారు. ఈ విషయం తెలుసుకున్న విదేశాల్లోని అతని స్నేహితులు కొందరు ఉద్యోగాలు వదులుకొని భారత్ వచ్చారు.

ఔరంగజేబు మృతి, రక్తం ఉడికిన యువత

ఔరంగజేబు మృతి, రక్తం ఉడికిన యువత

ఔరంగజేబును ఉగ్రవాదులు హత్య చేసిన విషయం తెలియగానే అతని ఇంటి సమీపంలో ఉండేవారు, కొందరు స్నేహితుల రక్తం ఉడికిపోయింది. దీంతో గల్ఫ్ తదితర దేశాల్లో ఉండే 50 మంది ఇందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు కాశ్మీర్ గడ్డపై అడుగు పెట్టారు. వారు దక్షిణ కాశ్మీర్‌లోని మెందర్‌లోని తమ గ్రామమైన సలానికి చేరుకున్నారని వార్తలు వస్తున్నాయి.

ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు

ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు

రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన ఔరంగజేబు షోపియాన్‌లోని షాదిమార్గ్‌లో విధులు నిర్వర్తించారు. ఈ ఏడాది జూన్‌లో రంజాన్ సందర్భంగా ఇంటికి వెళ్తుండగా ఉగ్రవాదులు అపహరించి హత్య చేశారు. అతని మృతదేహాన్ని పోలీసులు గుస్సు గ్రామంలో గుర్తించారు. ఇది పుల్వానా జిల్లాలోని కలంపురకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉగ్రవాదులు అతని తల, మెడపై కాల్చి దారుణంగా చంపారు.

పోలీసు, ఆర్మీ ఉద్యోగాల్లో చేరేందుకు

పోలీసు, ఆర్మీ ఉద్యోగాల్లో చేరేందుకు

ఔరంగజేబును టెర్రరిస్టులు దారుణంగా చంపడంతో ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులు ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. జమ్ము కాశ్మీర్‌లో తీవ్రవాదం లేకుండా చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఔరంగజేబు హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా తదితర దేశాల నుంచి ఉద్యోగం వదిలి వచ్చారు. వారు ఆర్మీ, పోలీసు ఉద్యోగాల్లో చేరేందుకు వచ్చారని వార్తలు వస్తున్నాయి.

భారీ వేతనాలు వదులుకొని వచ్చారు

భారీ వేతనాలు వదులుకొని వచ్చారు

అలా ఉద్యోగం వదిలి వచ్చిన 50 మందిలో మొహమ్మద్ కిరామత్ ఉన్నారు. ఆ యువకుడు మాట్లాడుతూ.. ఔరంగజేబును ఉగ్రవాదులు చంపారని తెలియగానే నా ఉద్యోగానికి రాజీనామా చేశానని, వెంటనే స్వస్థలానికి బయలుదేరానని, తనలాగే సుమారు 50 మంది యువకులు భారీ వేతనాలను వదులుకుని సలానీకి తిరిగి వచ్చారని, తమ అందరి లక్ష్యం ఔరంగజేబు హత్యకు ప్రతీకారం తీర్చుకోవడమే అన్నారు. ఉగ్రవాదుల్ని వేటాడేందుకు తాము అందరం ఆర్మీ, పోలీస్ విభాగంలో చేరుతామన్నారు.

English summary
With their hearts set on avenging the death of rifleman Aurangzeb, who was abducted and then killed by terrorists in south Kashmir in June, as many as 50 youths left their jobs in the Gulf to return to Salani village in Mendhar, said media reports on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X