వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢీ...అసెంబ్లీలో బలాన్ని నిరుపించేందుకు రెఢీ... సీఎం కమలనాథ్

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీలో బలం నిరుపించుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మధ్యప్రదేశ్ సీఎం కమలనాథ్ ప్రకటించారు. ఇది తనకు మంచి అవకాశమని ఆయన తెలిపారు. ఇప్పటికే ఐదు నెలల్లో నాలుగు సార్లు తన బలాన్ని నిరూపించుకున్నానని ఆయన ప్రకటించారు. కాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మైనారీటీలో ఉందని ఆ రాష్ట్ర్ర్ర బీజేపీ నేత ప్రతిపక్షనాయకుడు గోపాల్ భార్గవ్ గవర్నర్ కలిసి లేఖ ఇచ్చిన కొద్ది గంటల్లోనే సీఎం కమలనాథ్ ప్రతిస్పందిచారు.

ప్రభుత్వ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్దంగా ఉన్నాం

ప్రభుత్వ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్దంగా ఉన్నాం

కాగా కమలనాథ్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన రోజు నుండే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ,ఇలా ఇప్పటికే అయిదు నెలల కాలంలో నాలుగు సార్లు ప్రభుత్వ మెజారిటీ నిరూపించుకున్నానని ఇప్పుడు మరోసారి ప్రభుత్వ మెజారీటీ నిరూపించుకునేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించారు.బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలనే తలంపుతోనే ఇదంతా చేస్తుందని ఆయన విమర్శలు చేశారు.

ప్రభుత్వం మైనారీటీలో ఉందంటూ గవర్నర్ కలిసిన బీజేపీ

ప్రభుత్వం మైనారీటీలో ఉందంటూ గవర్నర్ కలిసిన బీజేపీ

కేంద్రంలో బీజేపీ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్‌పోల్ ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌‌లో కూడ తిరిగి అధికారం చేపట్టేందుకు బీజేపీ పావులు కదిపింది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనారీటిలో ఉందంటూ బీజేపీ నేత ,ప్రతిపక్ష పార్టీ నాయకుడు గవర్నర్ అనందిబెన్ పటేల్‌కు లేఖ రాశాడు. దీంతోపాటు ప్రభుత్వం యొక్క బలాన్ని నిరూపించుకునేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరారు.

ప్రభుత్వం పడిపోవడం ఖాయం

ప్రభుత్వం పడిపోవడం ఖాయం

ఇక ఈ పరిణామాలు రాత్రీకి రాత్రే జరిగినవి కావని ,గత మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలని ప్రతిపక్ష నేత బీజేపీ నాయకులు చెప్పారు ప్రభుత్వం తనకు తాను పడిపోతుందని , కాని అది గంటల్లో జరిగే అవకాశాలు లేకపోయినా ప్రభుత్వంపడిపోవడం ఖాయమని ట్విట్టర్ వేదికగా పేర్కోన్నారు.

ఎంపీలో 2018లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం

ఎంపీలో 2018లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం

కాగా గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి ఎస్సీ,బీఎస్పీ పార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా అధికారాన్నిచేజిక్కించుకుంది.కాగా గత ఎన్నికల్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 114 బీజేపీకి 109 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులతోపాటు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒకరు ఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థుల సపోర్టుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

English summary
Madhya Pradesh CM Kamal Nath said that his government is ready for an assembly floor test. Kamal Nath also said that the Congress-led government in Madhya Pradesh proved majority at least four times in the last five months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X