వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసం ప్రవేశపెట్టిన గట్టెక్కుతాం : కుమార క్యాబినెట్ ధీమా

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్ణాటక సంకీర్ణ సర్కార్‌లో అంతర్గత మరింత ముదిరింది. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాల స్పీకర్ వద్ద ఉండటం, వాటిపై ఏ నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించనుండటంతో బెంగళూరులో పొలిటికల్ సిచుయేషన్ క్రమంగా మారిపోతోంది. ఈ క్రమంలోనే తన సహచరులతో సీఎం కుమారస్వామి మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.

దెబ్బ ..

దెబ్బ ..

16 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరేయడంతో కుమారస్వామి సర్కార్‌కు కొలుకోలేని దెబ్బ. దీంతో స్పీకర్ అనే బ్రహ్మస్ర్తంతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం .. సుప్రీంకోర్టు మెట్లెక్కసరికి తోకముడవక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కుమారస్వామి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ధైర్యంగా ఎదుర్కొందామని సమావేశంలో ముక్తకంఠంతో అభిప్రాయం వ్యక్తమైంది.

గట్టెక్కుతాం ..

గట్టెక్కుతాం ..

సభలో విపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన ఫరవాలేదని పేర్కొంది. దాని నుంచి గట్టేక్కుతామని .. బెంగ పడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అంతేకాదు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలవుతున్నా ఇప్పటికీ ఏడుసార్లు ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నించిందని సమావేశం తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణ బైరే గౌడ మీడియాకు వివరించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నిరంతరాయంగా పనిచేస్తుందని ఆరోపించారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మండిపడ్డారు. ఇవాళ్టి కన్నా ఇదివరకు ఇంకా గడ్డు పరిస్ధితులను ఎదుర్కొన్నామని వివరించారు. ఆ సమయంలో సీఎం, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ ధైర్యంగా వారిని ఎదుర్కొందని గుర్తుచేశారు.

ఇదీ లెక్క

ఇదీ లెక్క

మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారిలో 13 మంది కాంగ్రెస్ సభ్యులు కాగా మరో ముగ్గురు జేడీఎస్‌కు చెందినవారు. రాష్ట్రంలో మొత్తం 225 స్థానాలు ఉన్నాయి. 113 సీట్లు సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది. బీజేపీ 105 సీట్లకు పరిమితం అవడంతో .. జేడీఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వీరికి ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా మద్దుతు తెలిపారు. ఆ 16 మంది రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే సంకీర్ణ సర్కార్ బలం 100 సీట్లకు పడిపోతుంది. అంటే ప్రభుత్వం మైనార్టీలో పడుతుంది.

English summary
As the government in Karnataka faces an existential crisis with the resignation of 16 legislators of the ruling coalition, the state Cabinet that met on Thursday resolved to face the situation "bravely" and "withstand" it unitedly. Expressing confidence that the government would survive, the cabinet that met under the leadership of Chief Minister HD Kumaraswamy said it was ready to face a no-confidence motion, if moved by the opposition BJP. "Political developments were discussed, what was discussed and decided was that the government is in a crisis situation, there is no doubt about it, various reasons for it and steps to solve it were discussed," Rural development minister Krishna Byre Gowda said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X