వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏపై చర్చలకు రెడీ.. ప్రధాని మోదీకి కండిషన్లు పెట్టిన దీదీ

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని టీఎంసీ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. సోమవారం సీఏఏ వ్యతిరేక నిరసనలో పాల్గొన్న ఆమె ఈ మేరకు ప్రకటన చేస్తూ కొన్ని కండిషన్లు పెట్టారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్ పై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తవముతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటిదాకా చర్చల మాటెత్తలేదు. ప్రతిపక్ష పార్టీల నుంచే తొలిసారి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

ఇదే కండిషన్..
ప్రధాని చర్చలకు సిద్ధంగా ఉన్నానన్న మమత.. ముందుగా సీఏఏ చట్టాన్ని మోదీ ఉపసంహరించుకుంటేనే ముందుకెళతానని తిరకాసు పెట్టారు. కీలకమైన కాశ్మీర్, సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్ పై ప్రభుత్వం ఏనాడూ అఖిపక్ష సమావేశం నిర్వహించలేదని, వాటిలో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్ చాలా ప్రమాదకరమైన చట్టాలని, దేశానికి చేటు చేసే ఈ మూడిటిపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు.

 Ready for talks with PM if he withdraw CAA act: Mamata Banerjee

చచ్చేదాకా నో..
తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వెస్ట్ బెంగాల్ లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ పీఆర్ చట్టాలను అమలు చేయబోనని సీఎం మమత మరోసారి చెప్పారు. టీఎంసీ సమైక్య భారత్ ను, సమైక్య బెంగాల్ ను కోరుకుంటుందని, విభజన, విద్వేషాలకు తావిచ్చే చట్టాలను అంగీకరించబోమని అన్నారు. ఈ మేరకు అసెంబ్లీలోనూ తీర్మానాలు చేశామన్నారు. కేరళ, పంజాబ్, రాజస్థాన్ తర్వాత సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన నాలుగో రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది.

English summary
West Bengal chief minister Mamata Banerjee Tuesday said she is ready for talks with Prime Minister Narendra Modi on the issue of Citizenship Amendment Act but the Centre has to first withdraw the contentious law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X