వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు: సీఎంగా దిగిపోయేందుకు సిద్ధం..కాంగ్రెస్ వైఖరే కారణమా..?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్‌ల మధ్య విబేధాలు మొదలయ్యాయా..? రెండు పార్టీలకు ఒకరంటే ఒకరు పడటం లేదా... సీఎం కుమారస్వామి కాంగ్రెస్‌తో విసిగెత్తిపోయారా..? ఆయన మాటలు వింటే అలానే కనిపిస్తోంది. దీంతో కర్నాటక రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.

కుమారస్వామికి తలనొప్పిగా మారిన కాంగ్రెస్

కర్నాటకలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు ముదురుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేలను ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తున్నాయంటూ క్యాంప్ రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తన ప్రభుత్వంకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటూ సీఎం కుమారస్వామి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు. బయటి పోరు పక్కనబెడితే ఇప్పుడు కుమారస్వామికి ఇంటిపోరే ఎక్కువగా అయినట్లు తెలుస్తోంది.

సీఎం పదవినుంచి తప్పుకునేందుకు సిద్ధం

సీఎం పదవినుంచి తప్పుకునేందుకు సిద్ధం

కర్నాటకలో గతేడాది ఎన్నికల తర్వాత పొత్తు కుదుర్చుకుని కాంగ్రెస్ జేడీఎస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్‌గా నిలవడంతో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రమాణస్వీకారం కూడా చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రమాణ స్వీకారం అయితే చాలా గ్రాండ్‌గా జరిగింది కానీ.. ఆ తర్వాత ప్రభుత్వం మాత్రం ఒకరకంగా ఇబ్బందుల్లో ఉన్నట్లే కనిపించింది. దీనికి కారణం బీజేపీ ఒకటైతే.. రెండోది కాంగ్రెస్ వారే బెదిరింపులకు దిగడం. అయితే వీటన్నిటినీ ఓర్చుకుంటూ సీఎం కుమారస్వామి ముందుకెళ్లారు. కానీ తాజా పరిణామాలు కుమారస్వామిని విసిగెత్తిపోయేలా తయారయ్యాయని చెప్పేందుకు ఆయన మాటలే నిదర్శనంగా నిలిచాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్టానం కనుక నియంత్రించకుంటే.. తాను ముఖ్యమంత్రిగా దిగిపోయేందుకు సిద్ధమనే కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తనను కాంగ్రెస్ నేతలు పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు కుమారస్వామి. ఈక్రమంలోనే కాంగ్రెస్‌‌కు గుడబై చెప్పేందుకు కూడా సిద్ధమయ్యారనే తెలుస్తోంది.

కర్నాటక పాలిటిక్స్ : 19-19-19 సీక్రెట్ కోడ్ ఏమిటి..కన్నడ రాజకీయాల్లో ఏం జరగబోతోంది..? కర్నాటక పాలిటిక్స్ : 19-19-19 సీక్రెట్ కోడ్ ఏమిటి..కన్నడ రాజకీయాల్లో ఏం జరగబోతోంది..?

కేబినెట్ మంత్రులే కుమారస్వామిని సీఎంగా గుర్తించడంలేదా..?

కేబినెట్ మంత్రులే కుమారస్వామిని సీఎంగా గుర్తించడంలేదా..?


కుమారస్వామి కేబినెట్‌లో మంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత పుట్టరంగ శెట్టి... తన దృష్టిలో కుమారస్వామి సీఎం కాదని సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అనే వ్యాఖ్యలు చేయడంతో కుమారస్వామి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు హద్దుమీరుతున్నారని కుమారస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఇలానే వ్యవహరిస్తే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటాననే సంకేతాలు పంపారు కుమారస్వామి. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడు నెలల పూర్తయినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటున పడ్డాయని సిద్ధరామయ్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. అంతేకాదు సిద్ధరామయ్యకు మరో ఐదేళ్లు అధికారం ఇచ్చి ఉంటే రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోయి ఉండేదని మరో సిద్ధరామయ్య వర్గీయుడు ఎమ్మెల్యే సోమశేఖర్ వ్యాఖ్యానించారు.

సంకీర్ణ ప్రభుత్వంలో బేధాభిప్రాయాలు సహజం: దేవెగౌడ

సంకీర్ణ ప్రభుత్వంలో బేధాభిప్రాయాలు సహజం: దేవెగౌడ

కర్నాటక సంకీర్ణ ప్రభుత్వంలో బేధాభిప్రాయాలు రావడంతో మాజీ ప్రధాని జేడీఎస్ అధినేత దేవెగౌడ స్పందించారు. సంకీర్ణ ప్రభుత్వం అన్నాక బేధాభిప్రాయాలు రావడం సహజమే అన్నారు. అంతమాత్రాన ప్రభుత్వం పడిపోదని తెలిపారు. ఈ విషయాన్ని పెద్దగా చూడాల్సిన పనిలేదన్నారు దేవెగౌడ. కూర్చుని సమస్యను చర్చించి పరిష్కారం కనుగొంటే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. దీనిపై ఇంతకంటే తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు దేవెగౌడ.

English summary
In his most direct threat yet to coalition partner Congress, Karnataka chief minister HD Kumaraswamy on Monday said he was ready to step down if the party does not control its MLAs. The blunt statement came after Congress’ C Puttaranga Shetty, a minister in the state government, said that for him, Siddaramaiah was still the chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X