బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీకి సమాధానం చెప్పడానికి రెఢీ, అత్యుత్సాహం, ఐటీ హబ్ కు ఏం చేశారు: మాజీ ప్రధాని!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీకి సరైన సమయంలో తాను సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నానని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. అధికార దాహంతో కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకోలేదని, ప్రజల కోరిక మేరకు పొత్తు పెట్టుకున్నామని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ స్పష్టం చేశారు. ఐటీ హబ్ కు మీరు ఏం చేశారో చెప్పాలని బీజేపీని ఆయన ప్రశ్నించారు.

బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కృష్ణభైరే గౌడకు మద్దతుగా హెచ్.డి. దేవేగౌడ ప్రచారం చేశారు. ఈ సందర్బంగా హెచ్.డి. దేవేగౌడ ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు .

బాష ఏదైనా ఒకటి రెండు మినహా మీడియా మిత్రులు ఎక్కువ శాతం ప్రధాని నరేంద్ర మోడీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఆరోపించారు. మీడియా ఎందుకు మోడీని వెనుక వేసుకువస్తుందో అర్థం కావడం లేదని దేవేగౌడ అన్నారు.

ఐటీ శాఖ వలలో బిల్డర్: రూ. 40 లక్షల లంచం డిమాండ్: అడ్వాన్స్ గా రూ. 14, సీబీఐ అరెస్టు!ఐటీ శాఖ వలలో బిల్డర్: రూ. 40 లక్షల లంచం డిమాండ్: అడ్వాన్స్ గా రూ. 14, సీబీఐ అరెస్టు!

 Ready to answer for Narendra Modi PM of India says former PM Deve Gowda

ఐటీ, బీటీ సంస్థలకు బెంగళూరు ఎంతో ప్రసిద్ది చెందిందని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. బెంగళూరు నగరానికి ఎన్నోసార్లు వచ్చి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ నగరానికి ఏమి ఇచ్చారు ? అని హెచ్.డి. దేవేగౌడ ప్రశ్నించారు. బెంగళూరును ఐటీ, బీటీ నగరంగా తీర్చిదిద్దింది ప్రధాని మోడీ కాదని హెచ్.డి. దేవేగౌడ గుర్లు చేశారు.

యువత నిత్యం మోడీ, మోడీ అంటున్నదని, ఆయన మీకు ఏం చేశారు, ఉద్యోగాలు ఇచ్చారా అని హెచ్.డి. దేవేగౌడ ప్రశ్నించారు. ఫేస్ బుక్ తో పాటు సోషల్ మీడియాలో యువత ఎక్కువగా నరేంద్ర మోడీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నదని, ఇది చాల విచారకరం అని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత నరేంద్ర మోడీకి తాను సరైన సమాదానం చెబుతానని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ చెప్పారు.

English summary
Ready to answer for Narendra Modi PM of India. We are join hands in lok sabha polls 2019 for people not for power said JDS supremo H.D.Deve Gowda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X