వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో శాంతి కోసం దేనికైనా సిద్ధం: రజినీకాంత్, సీఏఏపై ముస్లిం పెద్దల కృతజ్ఞతలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశంలో శాంతి, సామరస్యాన్ని నెలకొనేందుకు తన వంతు పాత్ర పోషించడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఘర్షణలను ఖండించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

రజినీకాంత్ పార్టీ ఏర్పాటు ఈ ఏడాదే: ఏ నెలలో తెలుసా? అప్పుడే పార్టీ పేరు, పొత్తులపై ప్రకటన!రజినీకాంత్ పార్టీ ఏర్పాటు ఈ ఏడాదే: ఏ నెలలో తెలుసా? అప్పుడే పార్టీ పేరు, పొత్తులపై ప్రకటన!

దేశంలో శాంతి కోసం..

దేశంలో శాంతి కోసం..


అంతకుముందు రజినీకాంత్‌ను ఆయన నివాసమైన పోయెస్ గార్డెన్‌లో పలువురు ముస్లిం పెద్దలు కలిశారు. ఈ క్రమంలో రజినీకాంత్ ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో శాంతియువత వాతావరణం కోసం తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమని అన్నారు. దేశంలో ప్రేమ, సమైక్యత, శాంతిని నెలకొల్పడమే ప్రజల తొలి ప్రాధాన్యంగా ఉండాలన్న ముస్లిం సోదరుల అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

సీఏఏపై రజినీకి కృతజ్ఞతలు

సీఏఏపై రజినీకి కృతజ్ఞతలు

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం ఉండదని రజినీకాంత్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఒకవేళ భారత ముస్లింలకు నష్టం జరుగుతుందనుకుంటే తానే ముందుగా కేంద్రాన్ని నిలదీస్తానని, చట్టాన్ని వ్యతిరేకిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో హజ్ కమిటీ అధ్యక్షుడు అబూబక్కర్ తోపాటులు పలువురు ముస్లిం పెద్దలు రజినీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఢిల్లీ అల్లర్లపై రజినీకాంత్ ఆగ్రహం..

ఢిల్లీ అల్లర్లపై రజినీకాంత్ ఆగ్రహం..

కాగా, గతవారం ఈశాన్య ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లపై రజినీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఘర్షణల్ని అదుపు చేయడంలో ఢిల్లీ ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా విఫలమైందని అన్నారు. హింస ఆపలేని వారు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ ఘాటుగా స్పందించారు. హింసను ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు.

రజినీకాంత్‌తో బీజేపీ పొత్తుపై..

రజినీకాంత్‌తో బీజేపీ పొత్తుపై..

ఇది ఇలావుండగా, రజినీకాంత్ పెట్టబోయే పార్టీతో బీజేపీ పొత్తుపై వస్తున్న వార్తలపై బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పందించారు. ముందు రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఈ విషయంపై ఆలోచిస్తే మంచిదన్నారు. రజినీ పార్టీ జెండా, ఎజెండా ఏమిటో వెల్లడించిన తర్వాతే ఆయన పార్టీతో పొత్తు గురించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కాగా, సీఏఏతో భారతీయులెవరికీ నష్టం లేదని తమిళనాడు సీఎం పళనిస్వామి అసెంబ్లీ ప్రకటించారని, మీడియా పదే పదే అడగడంతో సీఏఏపై వ్యతిరేక తీర్మానం చేసే విషయమై పరిశీలిస్తామని చెప్పారని మాజీ కేంద్రమంతి తెలిపారు.

కమల్‌పై మాజీ కేంద్రమంత్రి విమర్శలు

కమల్‌పై మాజీ కేంద్రమంత్రి విమర్శలు

అయితే, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, రజినీకాంత్ మిత్రుడు కమలహాసన్ ఆయనతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని విజయం సాధించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కమలహాసన్ రాజకీయ పార్టీ గురించి మాట్లాడుతూ.. సినిమా నిర్మించినంత తేలిక కాదని పోన్ రాధాకృష్ణన్ అన్నారు. రాష్ట్రంలో 50ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేదని.. తమిళనాడు అభివృద్ధికి 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకమన్నారు. అన్నాడీఎంకే పార్టీని రాజ్యసభ సీటును కోరడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఇతర పార్టీల్లానే బీజేపీ కూడా సిద్ధమవుతోందన్నారు.

English summary
Days after condemning the communal violence in Delhi, Tamil film superstar and politician Rajinikanth said on Sunday that he was willing to play any role in order to maintain peace in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X