వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాత్రంతా సభలోనే ఉంటాం .. ఆహారం అందించండి... స్పీకర్‌ను కోరిన యడ్యూరప్ప

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి ట్వీస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. తాజాగా రాత్రి 10.45 గంటలకు కూడా సభలో బలపరీక్ష జరగలేదు. అధికార, విపక్ష సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లిపోయింది. అయితే విశ్వాస పరీక్ష ఓటింగ్‌లో పాల్గొనేందుకు తాము సిధ్దమని .. అయితే తమకు భోజనాలు తెప్పించాలని బీజేపీ సభ్యులు కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 ‘Ready to wait post midnight for trust vote, get food’:

బలపరీక్ష చర్చ జరిగి .. ఓటింగ్ జరిగే వరకు సభలోనే ఉంటామన్నారు బీజేఎల్పీ నేత యడ్యరప్ప. అయితే తమకు ఆహారం అందించాలని స్పీకర్‌ కోరారు. కాంగ్రెస్ జేడీఎస్ కు చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ విశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాలను సీఎం కుమారస్వామి కాలం వెళ్లదీశారు. ఇక సోమవారం అలాంటి పరిస్థితి లేదు. విపక్ష బీజేపీ సభలోనే ఉండిపోయింది. అయితే గురువారం కూడా రాత్రంతా బీజేపీ సభ్యులు సభలో గడిపిన సంగతి తెలిసిందే. ఆ రోజు సభ్యులు మసాల దోష, పెరుగన్నం తిని అసెంబ్లీలోనే నిద్రపోయారు. అయితే శుక్రవారం కూడా బలపరీక్ష నిర్వహించలేదు. సోమవారం ఎట్టి పరిస్ధితుల్లో జరుపుతామని చెప్పి .. బీజేపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు.

దీంతో సభలో రాత్రంతా ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది. మొత్తానికి అధికార విపక్షాలు మాత్రం తమ పంతం నెగ్గించుకునేందుకు మాత్రం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ .. మంగళవారం నిర్వహిస్తామని అధికార పార్టీ బెట్టుచేస్తున్నాయి.

English summary
Amid slogan shouting and members trooping into the well of the house during the trust vote debate in the Karnataka assembly, opposition leader BS Yeddyurappa declared that he will stay put till midnight for the motion to be moved. Yeddyurappa, in the event of his staying, urged the house to arrange for food. Last week, on Thursday, about 100 BJP legislators slept in the Karnataka Assembly to protest against the delay in taking the floor test by Chief Minister Kumaraswamy on the confidence motion he moved to prove his Congress-JD-S coalition government has majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X