వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ రాష్ట్రపతి పాలన సిఫార్సు వెనుక: ఎన్సీపీ ఏం చేసింది: మహా రాజకీయాల్లో అసలు ట్విస్ట్..!

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర పాలనా వ్యవహారాలు ఇక రాష్ట్రపతి చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఈ రాత్రి 8.30 గంటలకు వరకు ఎన్సీపీకి సమయం ఇచ్చిన గవర్నర్..ఆకస్మికంగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయటం పైన విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, గవర్నర్ ఆ నిర్ణయం తీసుకోవటం వెనుక అసలు కారణం ఎన్సీపీనే. తమకు మరో 48 గంటల సమయం కావాలంటూ గవర్నర్ ను ఎన్సీపీ నేతలు అభ్యర్దించారు. తమకు విధించిన డెడ్ లైన్ కు సమయం సరిపోదని..పొడిగించాని కోరారు. అదే సమయంలో కాంగ్రెస్ మద్దతు కోరిన ఎన్సీపీకి..ఆ పార్టీ నుండి మద్దతు లేఖ అందలేదు. దీంతో..గవర్నర్ ఎన్సీపీ అభ్యర్ధనను తిరస్కరిస్తూ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాసారు. దీంతో..కేంద్ర కేబినెట్ వెంటనే దానిని ఆమోదించటం..రాష్ట్రపతికి సిఫార్సు చేయటం..ఆయన ఆమోదించటం చకచకా జరిగిపోయాయి.

 మహా సంక్షోభం: ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం: మహారాష్ట్రీయుడికే అదనపు బాధ్యతలు..!</a><a class= " title=" మహా సంక్షోభం: ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం: మహారాష్ట్రీయుడికే అదనపు బాధ్యతలు..! " /> మహా సంక్షోభం: ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం: మహారాష్ట్రీయుడికే అదనపు బాధ్యతలు..!

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా లేమని గవర్నర్ కు స్పష్టం చేసింది. దీంతో..తరువాత మెజార్టీ పార్టీ అయిన శివసేనకు గవర్నర్ అవకాశం ఇచ్చారు. ఆ పార్టీ సైతం నిర్ణీత గడువు లోగా తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దీంతో..ఎన్సీపీని ఈ రాత్రి 8.30 గంటల సమయం లోగా ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. అయితే, ఈ ఉదయం నుండి ఎన్సీపీ నేతలు అటు ఢిల్లీ లోని కాంగ్రెస్ నేతలతో..శివసేన నేతలతోనూ మంతనాలు చేసారు. దీంతో..మరింత సమయం అవసరమవుతుందని అంచనాకు వచ్చిన ఆ పార్టీ నేతలు తమకు మరో 48 గంటల గడువు ఇవ్వాలని గవర్నర్ ను అభ్యర్దించారు. దీంతో..శివసేన విషయంలో ఖరాకండిగా నిర్ణయం తీసుకున్న గవర్నర్..ఇప్పుడు ఎన్సీపీ విషయంలోనూ అదే రకంగా స్పష్టం చేసారు. సమయం ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేసారు. అదే సమయంలో కాంగ్రెస్ నుండి మద్దతు లేఖ సైతం అందలేదని ఎన్సీపీ నేత అజిత్ పవార్ స్పష్టం చేసారు.

Reason behind governor recommends president rule is NCP request an extension of 48 hours

కేంద్రానికి గవర్నర్ సిఫార్సు..
ఎన్సీపీ మరింత సమయం కోరిన వెంటనే సాధ్యం కాదని తేల్చిన గవర్నర్..ఆ వెంటనే మహారాష్ట్రలో నెలకొన్ని పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాసారు. అదే సమయంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించటం లేదని తన నివేదికలో స్పష్టం చేసారు. ఇక, ఢిల్లీలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో..అందుబాటులో ఉన్న మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర గవర్నర్ పంపిన నివేదిక..ఆయన చేసిన సిఫార్సుల పైన చర్చించిన కేబినెట్..గవర్నర్ సిఫార్సు మేరకు మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఆమోదించాని కోరుతూ రాష్ట్రపతికి సిఫార్సు చేసారు. కేంద్ర కేబినెట్ రికమండేషన్ ఆధారంగా రాష్ట్రపతి వెంటనే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

English summary
Reason behind governor reccomanded president rule is NCP request an extension of 48 hours in the deadline for proving the majority.Then the governor went ahead and recommended the President's Rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X