వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతమైన మలేషియా అందాలను చూడటానికి 7 ఖచ్చితమైన రీజన్స్..!!

కొత్త సంవత్సరాది కొంగొత్త ఆలోచనలతో న్యూఇయర్కు స్వాగతం పలుకాలనుకుంటున్నారా? ప్రతీసారి కంటే విభిన్నంగా ఎక్కడికైనా వెళ్లి ఫ్యామిలీతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలనుకుంటున్నారా?

Google Oneindia TeluguNews

"మలేసియా ట్రూలి ఏసియా"

కొత్త సంవత్సరాది కొంగొత్త ఆలోచనలతో న్యూఇయర్కు స్వాగతం పలుకాలనుకుంటున్నారా? ప్రతీసారి కంటే విభిన్నంగా ఎక్కడికైనా వెళ్లి ఫ్యామిలీతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం బ్యాగులు సర్దుకుని, కౌలాలంపూర్ ప్రయాణానికి సిద్ధం కండి. అయ్యో ఎయిర్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోలేదు. న్యూఇయర్ సందర్భంగా ఎకనామికల్ బోనస్లు ఎలా అని సందేహ పడకండి. 15 సంవత్సరాలుగా విమానయాన సర్వీసులు అందిస్తున్న ఎయిర్ ఏషియా మీకోసం ఓ స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. ఏయిర్ ఏషియా వారు అత్యంత తక్కువ ధరలకు కేవలం రూ.999 కే బ్యూటిఫుల్ మలేషియా అందాలను మీకోసం మరింత దగ్గరగా చూపించబోతున్నది. ఈ పర్యటన సందర్భంగా మలేషియా రాజధానిగా ఉన్న కౌలాలంపూర్లో చూడదగ్గ ప్రదేశాలు, అబ్బురపరిచే విశేషాలు మీకోసం ఇక్కడ..

ఎంత అధునాతనంగా కనబడుతుందో, అంత ప్రాచీన చరిత్ర ఉన్న దేశం మలేషియా. ఈ మలేలా గడ్డ మీదకు భారతీ యులు, చైనీయులు అనాది కాలంలో వచ్చి స్థిరపడటంతో ఇది భిన్న జాతులు, విభిన్న సంస్కృతులకు ఆలవాలమైంది. కొన్ని చోట్ల సంస్కృత అక్షరాలు కూడా కనిపిస్తాయి. మలేషియా విభిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయ మరియు విభిన్న భాషా సమ్మేళిత ప్రజలు కలిగిన దేశం. మలేషియాలో ఒకప్పుడు నివసించిన ప్రస్తుతం తరలించబడిన పురాతన గిరిజన జాతుల సంస్కృతి మూలకేంద్రంగా చెప్పుకోవచ్చు. ఈ బ్యూటిఫుల్ నేషన్ థాయ్ లాండ్ మరియు ఇండోనేషియాకు మధ్యలో ఉంది. అక్కడ భిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, భిన్నమైన వంటకాలతో అలరాడిస్తూ ట్రావెలింగ్ లో మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

ఎవరైతే హాలిడే ట్రిప్స్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే, అలాంటి వారికోసం మలేషియా ఒక అద్భుతమైన ప్రదేశం అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే అద్భుతమైన బీచ్ లు, అద్భుతమైన సీసైడ్ రిసార్ట్ లు, మీ ప్రియమైన వారితో ఎంజాయ్ చేయడానికి ఫర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అఫిసియానాడోస్ చరిత్ర మరియు నిర్మాణం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ పర్యాటలకు ఆశ్చర్యం కలిగిస్తుంది, కెఎల్ టవర్ మరియు ఇస్టానా నెగరా మలేషియా పర్యాటకలు అత్యంత అద్భుతమైన , అందమైన భవాలను అక్కడి ఏకైక సంస్కృతిని పర్యాటకులు అద్భుతంగా ఆనందిస్తారు.

మలేషియా దేశానికి వాతావరణ స్థితిగతులకు తగ్గట్లుగా అధిక ఉష్ణోగ్రతలు (21 -35 డిగ్రీల సెల్సియస్) వద్ద పరిపూర్ణ మధ్యరేఖ వాతావరణంతో పర్యాటలకు ఆహ్లాదపరిచే వాతావరణంతో ప్రతి పర్యాటలకు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఈ విషయంలో ఏలాంటి నిస్సదేహం లేదు. సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే నిస్సందేహంగా హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. అంతే కాదు, 2017 లో హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేయడానికి మలేషియా/కౌలాలంపూర్ నే ఎందుకు ఎంపిక చేసుకోవాలి అనడానికి 7 ఖచ్చితమైన రీజన్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

బటు గుహలు :
ప్రశాంతతకు మారుపేరైన మలేషియాలో బటు గుహలు- బటు కేవ్స్ అద్భుత ప్రకృతి రమణీయ ప్రాంతం. అక్కడి రమణీయతకు మరో అందం అక్కడి షణ్ముఖాలయం. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ప్రధాన నగరం నుంచి ఈ ప్రాంతం తక్కువ దూరంలోనే ఉంటుంది. మలేషియాలో తమిళ భక్తులు ఎక్కువగా ఆ ప్రాంతానికి వస్తుంటారు. దీనికి 150కి పైగా మార్గాలున్నాయి. ప్రతీదానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ గుహల వరకు హైకింగ్ చేయడం సందర్శకుల పర్యటనలో మరిచిపోలేని అనుభూతి. అద్భుతమైన మధురానుభూతిని మిగులుతాయి.

reasons why you have to visit malaysia

ఫ్రాసర్ హిల్స్ :
మలేసియా రాజధాని కౌలాంలపుర్ నుండి 2 గంటల ప్రయాణంతో ప్రసర్ హిల్స్ కు ఉన్నాయి. ఇక్కడ పహాగ్ పర్వాతాల వద్ద అద్భుతమైన సైనిక్ రిసార్ట్ ఉంది. దీన్నే మలేషియాలో బుకిట్ ఫ్రేజర్ అని పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ మలేషియా వారికే కాదు అంతర్జాతీయ ప్రయాణికులకు ఒక గొప్ప ప్రదేశం, ఈ ఫ్రేజర్ హిల్స్ 1800 సంవత్సరాల నాటివని అక్కడి వారు చెబుతుంటారు, ఈ ప్రదేశంలో తగరం మరియు ఖనిజ వ్యాపారాలకు అత్యంత ప్రసిద్ది అని కూడా చెబుతుంటారు.

reasons why you have to visit malaysia

థెన్ హౌ టెంపుల్ :
సౌత్ ఏషియాలోనే అత్యంత పురాతనమైన దేవాలయం, థెన్ హో టెంపుల్లో చైనీస్ సముద్ర దేవతకు అంకితం చేయబడినది. ఈ అద్భుతమైన నిర్మాణం ఒక కొడపౌన నిర్మించబడి ఉంది.

reasons why you have to visit malaysia

పినాంగ్ బీచ్ :
పెనాంగ్ అనేది మలేషియాలోని ఒక రాష్ట్రము. ఇది మలక్క కాలువ నీటితో చుట్టబడిన భుభాగాముతో మలేషియా యొక్క తూర్పు పశ్చిమ తీరములో నెలకొని ఉంది. మింగ్ సామ్రాజ్యమునకు చెందిన అడ్మిరల్ జంగ్ హే 15 శతాభ్దములో దక్షిణ సముద్రములకు సంబంధించి చేసిన యాత్రలలో ఉపయోగించిన నావికా చిత్రాలలో పెనాంగ్ ద్వీపము బిన్లాంగ్ యు గా సూచించబడింది. పదిహేనవ శతాభ్దములో గోవా నుండి సుగంద ద్వీపాలకు ప్రయాణించే పోర్చుగీసు నావికులు వారిచేత పులో పినాఒంగా పిలువబడిన ద్వీపములో తరచుగా విశ్రమించేవారు. పనంగ్ అనే పేరు ఆధునిక మలయ్ పేరు అయిన పులవు పినాంగ్ అనే దాని నుండి వచ్చింది. దీని అర్ధము వక్క చెట్ల తోట ఉన్న ద్వీపము.

reasons why you have to visit malaysia

పెట్రోనాస్ టవర్స్ :
కౌలాలంపూర్లో అడుగుపెట్టగానే మొదటి సందర్శకులకు దర్శనమిచ్చేది పెట్రోనాస్ టవర్స్. ప్రపంచంలో ఇట్లాంటి టవర్స్ను బహుశా మీరెక్కడ చూసుండరేమో. ఆకాశానంటే జంట సౌధాల కలయికనే ఈ టవర్స్. వీటినే పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అని కూడా పిలుస్తుంటారు. విద్యుత్ దీపాలు వెలిగినప్పుడు కౌలాలంపూర్ కన్వెక్షన్ పార్కు నుంచి ఈ టవర్స్ను చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.

reasons why you have to visit malaysia

గోండోలా లిఫ్ట్ :
ది జంటింగ్ స్కై వే మలేషియం, అతి వేగంగా మరియు పొడవాటి గోండోల లిప్ట్స్ ఏషియాలోనే ఉన్నాయి. ఇవి గోటాంగ్ జయ మరియు పినాంగ్ రిసార్ట్ హోటల్ కు కనెక్ట్ చేయబడినవి. ఈ లిప్ట్ ఒక గంటకు దాదాపు 2000 సార్లు ప్రయాణిస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఆశ్వాదించడానికైనా మలేషియాకు వెళ్ళాల్సిందే.

ఏయిర్ ఏసియా వారు అంధించే అమేజింగ్ డీల్స్ :
2017 లో మలేషియా/కౌలాలంపుర్ విజిట్ చేయడానికి మరో ముఖ్యమైన కారణం , ఏయిర్ ఏషియా వారు అందించే అద్భుతమైన ఆఫర్స్ .ఏయిర్ ఏషియా వారు అత్యంత తక్కువ ధరలకు కేవలం రూ.999 కే బ్యూటిఫుల్ అందాలను మీకోసం మరింత దగ్గరికి చూపించబోతున్నది. మరి ఇంకెందుకు ఆలస్యం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X