
Rebel camp: చీటి చింపేయడానికి ఒకేఒక్క ఎమ్మెల్యే తక్కువ అయ్యాడు, ఏక్ నాథ్ దెబ్బతో ఏమైనా జరగొచ్చు !
ముంబాయి/గుహవాటి: ఏక్ నాథ్ దెబ్బతో మహారాష్ట్రలో ఏమైనా జరగొచ్చు అని స్పష్టంగా వెలుగు చూసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతోంది. కొందరు శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ అయ్యారు. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ కు, అసోంలోని గుహవాటికి వెళ్లిపోవడంతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని పెద్దలు షాక్ అయ్యారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి పనిచేసే ప్రసక్తేలేదని రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే తేల్చి చెప్పారు. ఇప్పటికే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఆరు మంది స్వంతత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకి మద్దతు ఇస్తున్నట్లు సంతకాలు చేసి ఆ లేఖను మహారాష్ట్ర గవర్నర్ కు పంపించారు. తనకు సీఎం కావాలని ఆశలేదని ఏక్ నాథ్ షిండే అంటున్నారు. అయితే మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం చీటి చింపేయడానికి, అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఏక్ నాథ్ షిండేకి ఒకేఒక్క ఎమ్మెల్యే తక్కువ పడ్డాడు.
MLAs:
విమానంలో
వెళ్లిపోతుంటే
ఇంటెలిజెన్స్
నిద్రపోయిందా
?,
మావాడే
మా
కొంపముంచాడు,
పవార్
ఫైర్
!

ఏక్ నాథ్ కు పెరుగుతున్న ఎమ్మెల్యేల మద్దతు
మరాఠీ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ సీనియర్ రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండేకి ఆ పార్టీలోని ఎమ్మెల్యేల మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. కొందరు శివసేన ఎమ్మెల్యేలు సీఎం ఉద్దవ్ ఠాక్రే శిబిరం నుంచి జంప్ అయ్యారు. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు గుజరాత్ లోని సూరత్ కు, అసోంలోని గుహవాటికి వెళ్లిపోయారు.

సీఎంకు షాక్
బుధవారం రాత్రి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వెనుక ఉన్న శివసేన ఎమ్మెల్యేలు కొందరు ఇప్పుడు ఆ గ్రూప్ నుంచి రెబల్ గ్రూప్ లోకి వెళ్లిపోవడంతో మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలోని పెద్దలు షాక్ అయ్యారు. బుదవారం రాత్రి సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆయన అధికారిక నివాసం ఖాలీ చేశారు. ఉద్దవ్ ఠాక్రే త్వరలో ఆయన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని శివసేనకు చెందిన కొందరు నాయకులు అంటున్నారు.

సీఎం కావాలని ఆశలేదు
తనకు సీఎం కావాలని ఆశలేదని ఏక్ నాథ్ షిండే అంటున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి పనిచేసే ప్రసక్తేలేదని రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే తేల్చి చెప్పారు. ఇప్పటికే 34 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఆరు మంది స్వంతత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండేకి మద్దతు ఇస్తున్నట్లు సంతకాలు చేసి ఆ లేఖను మహారాష్ట్ర గవర్నర్ కు పంపించారు.

46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు
తనకు 6 నుంచి 7 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో సహ మొత్తం 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గుహవాటిలోని రాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్ లో ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం చీటి చింపేయడానికి, అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఏక్ నాథ్ షిండేకి ఒకేఒక్క ఎమ్మెల్యే తక్కువ పడ్డాడని ప్రముఖ జాతీయ టీవీ చానల్ వార్తలు ప్రసారం చేసింది.