వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త‌ప్పు మాది కాదు: తిరుగుబాటు ఐడియా సిద్ధ‌రామ‌య్య‌దే: రెబెల్!

|
Google Oneindia TeluguNews

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో 14 నెల‌ల పాటు అధికారంలో కొన‌సాగిన కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ కూట‌మి స‌ర్కార్ కుప్పకూలిపోవ‌డం వెనుక ప్ర‌ధాన సూత్ర‌ధారి మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్యేన‌ని అంటున్నారు. సిద్ధ‌రామ‌య్య ప్రోద్బ‌లం వ‌ల్లే తాము త‌మ శాస‌న స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని తిరుగుబాటు ఎమ్మెల్యే శివ‌రామ్ హెబ్బార్ వెల్ల‌డించారు. త‌మ‌కు లేని ఆలోచ‌న‌ల‌ను పుట్టించార‌ని ఆరోపించారు. తాము ఇప్ప‌టికీ కాంగ్రెస్‌తోనే ఉన్నామ‌ని, భార‌తీయ జ‌న‌తాపార్టీతో ఎలాంటి సంబంధం లేద‌ని చెప్పారు.

య‌డ్డీకీ బ‌ల ప‌రీక్షే: 29 లేదా 31న విశ్వాస తీర్మానం? య‌డ్డీకీ బ‌ల ప‌రీక్షే: 29 లేదా 31న విశ్వాస తీర్మానం?

క‌ర్ణాట‌క‌లోని ఉత్త‌ర క‌న్న‌డ జిల్లా య‌ల్లాపుర నియోజ‌క‌వ‌ర్గానికి శివ‌రామ్ హెబ్బార్‌ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. కుమార‌స్వామి సార‌థ్యంలోని కాంగ్రెస్‌-జేడీఎస్ సంకీర్ణ ప్ర‌భుత్వంపై తిరుగుబాటు జెండా లేవ‌దీసిన 16 మంది ఎమ్మెల్యేల్లో ఆయ‌నా ఒక‌రు. బ‌ల ప‌రీక్ష ముగిసిన మ‌రుస‌టి రోజు ఆయ‌న ముంబై నుంచి య‌ల్లాపురకు చేరుకున్నారు. ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడారు. తిరుగుబాటు లేవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సిద్ధ‌రామ‌య్యేన‌ని, ఆయ‌న ఇచ్చిన సూచ‌న‌ల‌తోనే తాము రాజీనామా చేశామ‌ని అన్నారు. పార్టీకి దూరంగా ఉండాలని సూచించారని చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరు కూడా బీజేపీతో క‌లిసి లేర‌ని, తామంతా ఒకేమాట‌పై ఉన్నామ‌ని అన్నారు. బీజేపీలో చేర‌బోతున్నామ‌నేది అబ్ధ‌మ‌ని తేల్చి చెప్పారు.

Rebel Congress MLA claims Siddaramaiah was behind the rebellion

శివ‌రామ్ హెబ్బార్ ఆరోప‌ణ‌ల‌పై సిద్దరామయ్య స్పందించారు. ప్ర‌భుత్వం కూలిపోవ‌డానికి కార‌ణ‌మైన తిరుగుబాటు ఎమ్మెల్యేలు అకార‌ణంగా త‌నపై నింద‌లు వేస్తున్నార‌ని అన్నారు. త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెప్పారు. వారు ఎవ‌రిపై ఆరోప‌ణ‌లు చేసినా.. క్ర‌మ‌శిక్షణాచ‌ర్య‌ల నుంచి మాత్రం త‌ప్పించుకోలేర‌ని హెచ్చ‌రించారు. నిజం ఏమిటో నిల‌క‌డ‌గా తేలుతుంద‌ని అన్నారు. తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కూడా సొంత పార్టీలోనే కుంప‌ట్లు రాజేశార‌ని సిద్ధ‌రామ‌య్య విమ‌ర్శించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల ఆరోప‌ణ‌ల‌కు స్పందించాల్సిన అవ‌స‌రం త‌న‌కు లేద‌ని తేల్చి చెప్పారు. ఇలాంటి విష‌పూరిత‌మైన ఆరోప‌ణ‌ల‌ను స్వీక‌రించి, తాను గ‌ర‌ళ కంఠుడిని అయ్యాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

English summary
Karnataka collapsing following Tuesday’s floor test, one of the rebel MLAs Shivaram Hebbar, who returned to the state on Thursday said, “Siddaramaiah was the one who instigated us. We are still with Congress and we have nothing to do with BJP forming government.” Shivaram was one of the 15 rebel MLAs who had withdrawn support to the government, which led to the recent political crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X