వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rebel MLAs: ఏక్ నాథ్ మాట బీజేపీ వింటుందా ?, మంత్రి పదవులు, ఆశాఖల కోసం డిమాండ్ ?, అయితే !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/గోవా: మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి లైన్ క్లియర్ అయ్యింది. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవికి రాజీనామా చేసిన వెంటనే బీజేపీ నాయకులు రంగంలోకి దిగారు. శివసేన మీద తిరుగుబాటు చేసి సుమారు 50 మంది ఎమ్మెల్యేలను ఎగరేసుకుని వెళ్లి ప్రస్తుతం గోవాలో మకాం వేసిన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లు కలసి మంత్రి పదవుల పంపకం విషయంలో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే బీజేపీ నాయకులకు, రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే మద్య మంత్రి పదవులు, శాఖల కేటాయింపు విషయంలో చిన్నలొల్లి మొదలైయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి. ఇన్ని రోజులు దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండే ఫోన్ లో ఇలాంటి విషయాలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే ఒక్కరే గోవా నుంచి ముంబాయి వచ్చి మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ తో చర్చలు జరిపి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.

Rebel: ఊపుకుంటూ వెళ్లిపోయిన సంకీర్ణ ప్రభుత్వం, సీఎం, గవర్నర్ భేటీకి ఏక్ నాథ్ షిండే సిద్దం, ఎమ్మెల్యేలు !Rebel: ఊపుకుంటూ వెళ్లిపోయిన సంకీర్ణ ప్రభుత్వం, సీఎం, గవర్నర్ భేటీకి ఏక్ నాథ్ షిండే సిద్దం, ఎమ్మెల్యేలు !

దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండే చర్చలు

దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్ నాథ్ షిండే చర్చలు

మహారాష్ట్రలో బీజేపీ, ఏక్ నాథ్ షిండే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యకముందే మంత్రి పదవుల విషయంలో చిన్న సమస్య మొదలైయ్యిందని తెలిసింది. రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లు కలసి మంత్రి పదవుల పంపకం విషయంలో చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

ఏక్ నాథ్ కు దేవేంద్రుడి మనవి

ఏక్ నాథ్ కు దేవేంద్రుడి మనవి

ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు సైలెంట్ గా ఉంటే తరువాత అన్ని మాట్లాడుకుందామని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవంద్ర ఫడ్నవిస్ రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండేకి మనవి చేశారని తెలిసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత మీరు అడిగిన మంత్రి పదవులు, శాఖలు మీకు కేటాయిస్తామని, అంత వరకు రెబల్ ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకోవాలని ఏక్ నాథ్ షిండేకి దేవేంద్ర ఫడ్నవిస్ మనవి చేశారని సమాచారం.

 ఏక్ నాథ్ మాట బీజేపీ వింటుందా ?

ఏక్ నాథ్ మాట బీజేపీ వింటుందా ?

శివసేన మీద తిరుగుబాటు చేసి సుమారు 50 మంది ఎమ్మెల్యేలను ఎగరేసుకుని వెళ్లి ప్రస్తుతం గోవాలో మకాం వేసిన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లు కలసి మంత్రి పదవుల పంపకం విషయంలో ఇన్ని రోజులు ఫోన్ లో చర్చలు జరుపుతున్నారు. అయితే ఏక్ నాథ్ డిమాండ్ లను బీజేపీ నాయకులు వింటారా ? అనే చిన్న అనుమానం మొదలైయ్యింది.

ఏక్ నాథ్ అడుగుతున్న శాఖలు ఇవే

ఏక్ నాథ్ అడుగుతున్న శాఖలు ఇవే


శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే వర్గానికి 13 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ నాయకులు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఏక్ నాథ్ షిండేకి ఉప ముఖ్యమంత్రి పదవి గ్యారెంటీ అని తెలిసింది. అయితే మా వర్గానికి ఆర్థిక శాఖ, పట్టాణాభివృద్ది శాఖ, పీడబ్లూడీ శాఖలు మాకే కావలని ఏక్ నాథ్ షిండే పట్టుబడుతున్నారని తెలిసింది. ఈ శాఖలు మొదట సీఎం దగ్గర పెట్టుకుని తరువాత ఆ శాఖలు వేరే నాయకులకు ఇవ్వాలని బీజేపీ నాయకులు అంటున్నారని తెలిసింది.

 అన్ని శాఖలు ఇచ్చేస్తే మేమే ఏం చెయ్యాలి ?

అన్ని శాఖలు ఇచ్చేస్తే మేమే ఏం చెయ్యాలి ?

ముఖ్యమైన ఆర్థిక శాఖ, పట్టాణాభివృద్ది శాఖ, పీడబ్లూడీ శాఖలు ఏక్ నాథ్ షిండే వర్గానికి ఇచ్చేస్తే తరువాత మేము ఏం చెయ్యాలని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారని తెలిసింది. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే ఒక్కరే గోవా నుంచి ముంబాయి వచ్చి మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ తో చర్చలు జరిపి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.

English summary
Rebel MLAs: Uddhav Thackeray resigned even before the floor test. With the support of the rebel MLAs, the BJP is set to form the government. But before the formation of the government, the feud between rebel MLAs leader Eknath Shinde and BJP has begun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X