• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మెగాస్టార్, రెబల్ స్టార్ కరుణిస్తాడని లిస్టులో పేరు, బీజేపీకి వీరే !

|

బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికల ప్రచారం వేడి తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ ఎన్నికల్లో మీరు పోటీ చెయ్యాలని ఇంటికి వెళ్లి బీఫాం ఇచ్చినా వారం రోజుల పాటు కాంగ్రెస్ అధిష్టానికి, సీఎం సిద్దరామయ్యకు చుక్కలు చూపించి చివరికి ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తిరస్కరించిన స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ మీద ఆ పార్టీ నాయకులు ఇంకా ఆశలు పెట్టుకున్నారు.

కాంగ్రెస్ స్టార్స్ లిస్టు

కాంగ్రెస్ స్టార్స్ లిస్టు

రెబల్ స్టార్ పార్టీ కోసం ప్రచారం చేస్తారని కాంగ్రెస్ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో రెబల్ స్టార్ అంబరీష్ పేరు చేర్చి 40 మది లిస్ట్ ఎన్నికల కమిషన్ కు ఇచ్చారు.

బీజేపీ 40 మంది స్టార్స్ లిస్ట్

బీజేపీ 40 మంది స్టార్స్ లిస్ట్

బీజేపీ నాయకులు కర్ణాటక ఎన్నికల ప్రచారం ఎవరెవరు చేస్తారో అనే లిస్టును ఎన్నికల కమిషన్ కు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సినీ ప్రములు ప్రచారం చేస్తారని బీజేపీ ఎన్నికల కమిషన్ కు తెలిపింది.

కాంగ్రెస్ ప్రముఖులు

కాంగ్రెస్ ప్రముఖులు

సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మెగాస్టార్ చిరంజీవి, కేసీ వేణుగోపాల్, సిద్దరామయ్య, డాక్టర్ జీ పరమేశ్వర్, రెబల్ స్టార్ అంబరీష్, బహుబాష నటి ఖుష్బు, బహుబాష నటి మాలాశ్రీ, నటి రమ్య, మహమ్మద్ అజారుద్దీన్, మల్లికార్జున ఖార్గే, డీకే. శివకుమార్, ఎస్ఆర్. పాటిల్, దినేష్ గుండూరావ్, గులామ్ నబి అజాద్, సచిన్ పైలెట్, అశోక్ శంకర్ రావ్ చవన్, జ్యోతిరాదిత్య మాధవరావ్ సింధ్య, సుస్మితా దేవ్, ఉమన్ చాండి, శశి తరూర్, ఎం. వీరప్ప మొయిలీ, బీకే. హరిప్రసాద్, కేహెచ్. మునియప్ప, సతీష్ జారకిహోళి, సీఎం. ఇబ్రహీం, ముఖ్యమంత్రి చంద్రు,హెచ్ కే. పాటిల్, ఆర్ వీ. దేశ్ పాండే, రామలింగా రెడ్డి, కేజే. జార్జ్, ఎంబీ. పాటిల్, రోషన్ బేగ్, డాక్టర్ హెచ్ సీ. మహదేవప్ప, జమీర్ అహమ్మద్, రాణి సతీష్, ధనంజయ్ కుమార్ పేర్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కు ఇచ్చింది.

బీజేపీకి ప్రచారం చేసే స్టార్స్

బీజేపీకి ప్రచారం చేసే స్టార్స్

నరేంద్ర మోడీ, అమిత్ షా, బీఎస్. యడ్యూరప్ప, రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వారాజ్, నితీన్ గడ్కరి, డివి. సదానందగౌడ, అనంత్ కుమార్, నిర్మలా సీతారామన్, బ్యూటీక్వీన్ హేమమాలిని, బహుబాష నటి తారా అనురాధ, శ్రతి, ప్రకాష్ జవడేకర్, పియుష్ ఘోయల్, యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, దేవేంద్ర ఫడ్నవిస్, రవిశంకర్ ప్రసాద్, రామలాల్, పి. మురళిధర్ రావ్, దగ్గుబాటి పురందేశ్వరి, బిఎల్ శంకర్, అరుణ్ కుమార్, ధావర్ చంద్ గోల్హడ్, నిరంజన్ జ్యోతి, రమేష్ జిగజిణగి, అనంత్ కుమార్ హెగ్డే, ఎస్ఎం. కృష్ణ, ప్రహ్లద్ జోషి, బళ్లారి ఎంపీ శ్రీరాములు, పీసీ. మోహన్, జగదీష్ శెట్టర్, కేఎస్. ఈశ్వరప్ప, ఆర్. అశోక్, శోభా కరందాజ్లే, ఎస్. రవికుమార్, మనోజ్ తివారి, బిజి, పుట్టస్వామి పేర్లను బీజేపీ ఎన్నికల కమిషన్ కు ఇచ్చింది.

తెలుగు ప్రజలు టార్గెట్

తెలుగు ప్రజలు టార్గెట్

తెలుగు ప్రజలు (ప్రవాసాంధ్రులు) అధికంగా ఉంటున్న ప్రాంతాల్లో మెగాస్టార్ చిరంజీవితో ఎన్నికల ప్రచారం చేయించాలని, తమిళ ప్రజలు ఉన్న ప్రాంతాల్లో కుష్బు చేత ప్రచారం చేయించాలని కాంగ్రెస్ ప్లాన్ వేసింది. తెలుగు ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాల్లో దగ్గుబాటి పురందేశ్వరి, నటి తారా అనురాధతో ప్రచారం చేయించాలని బీజేపీ ప్లాన్ వేసింది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు, బహుబాష నటి నగ్మా ఎందుకు దూరంగా ఉన్నారో అర్థం కావడం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

English summary
Rebel star Ambareesh, who denied B form from Mandya constituency and former Mandya MP and film.star Ramya have named in Congress star campaigners list which approved by the election commission. Sam time the commission has also approved BJP star campaigners list including prime minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X