వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rebel: అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ నిర్వహణకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము, సుప్రీం కోర్టు ఆదేశాలు, బిగ్ రిలీఫ్ !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ గుహవాటి: మహారాష్ట్ర అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని సీనియర్ శివసేన ఎమ్మెల్యేలు చేసిన మనవిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టె నిర్వహించడానికి మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏక్ నాథ్ షిండేతో పాటు శివసేన మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు, వారి ఆస్తులకు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని, భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు వారి వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించడానికి ఈరోజు సాయంత్రం వరకు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గడువు ఇచ్చారు. అయితే జులై 12వ తేదీ వరకు రెబల్ ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ కు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

MLAs: రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయి వెళ్లడానికి డేట్ ఫిక్స్ చేసిన ఏక్ నాథ్, మీ సెక్యూరిటీ భాద్యత నాదే !MLAs: రెబల్ ఎమ్మెల్యేలు ముంబాయి వెళ్లడానికి డేట్ ఫిక్స్ చేసిన ఏక్ నాథ్, మీ సెక్యూరిటీ భాద్యత నాదే !

సుప్రీం కోర్టుకు వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలు

సుప్రీం కోర్టుకు వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సొంతపార్టీ ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయారని, మా మీద అనర్హత వేటు వెయ్యకుండా ఆదేశాలు ఇవ్వాలని ఏక్ నాథ్ షిండే, శివసేనకు చెందిన కొందరు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఏక్ నాథ్ షిండే సమర్పించిన అర్జీ విచారణ చేసిన సుప్రీం కోర్టు శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యకుండా స్టే విధించింది. జులై 11వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

డిప్యూటీ స్పీకర్ కు నోటీసులు

డిప్యూటీ స్పీకర్ కు నోటీసులు

శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యకూడదని మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. శివసేన రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే తమ మీద అనర్హత వేటు వెయ్యకుండా ఆదేశాలు జారీ చెయ్యాలని, శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు మావైపు ఉన్నారని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేము

మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేము

మహారాష్ట్ర అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని సీనియర్ శివసేన ఎమ్మెల్యేలు చేసిన మనవిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టె నిర్వహించడానికి మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. శివసేనకు చెందిన అనీల్ చౌధరి, సునీల్ ప్రభు సమర్పించి పిటిషన్ విచారణ చేసిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.

 రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత

రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత

మాకు, మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, ఆ ఆస్తులకు భద్రత కల్పించాలని శివసేన మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏక్ నాథ్ షిండే పాటు శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు, వారి కుటుంబ సభ్యులకు, వారి ఆస్తులకు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని, భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది.

 ఊపిరిపీల్చుకున్న రెబల్ ఎమ్మెల్యేలు

ఊపిరిపీల్చుకున్న రెబల్ ఎమ్మెల్యేలు

శివసేన రెబల్ ఎమ్మెల్యేలు వారి వాదనలు లిఖితపూర్వకంగా సమర్పించడానికి జూన్ 28వ తేదీ మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గడువు ఇచ్చారు. ఈ విషయంపై శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు జులై 12వ తేదీలోపు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. మొత్తం మీద సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏక్ నాథ్ షిండేతో పాటు రెబల్ ఎమ్మెల్యేలు ఊపిరిపీల్చుకున్నారు.

English summary
Rebel: The Supreme Court on Monday turned down a prayer to pass interim order against the holding of floor test in the Maharashtra legislative assembly till July 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X