వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2013లో మధ్యప్రదేశ్‌లో ఎవరు, ఎన్ని సీట్లు గెలిచారు?: చౌహాన్ ముందు ఇప్పుడున్న సవాళ్లు

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్‌లో బుధవారం (28-11-2018) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌తో పాటు మిజోరాంలోను పోలింగ్ జరగనుంది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2013లో బీజేపీ మూడోసారి గెలిచింది. ఇప్పుడు గెలిస్తే నాలుగోసారి అవుతుంది. ఈ నేపథ్యంలో 2013లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో చూద్దాం.

క్రితంసారి 25 నవంబర్ 2013లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 8 డిసెంబర్‌న ఫలితాలు వచ్చాయి. 230 స్థానాలకు గాను బీజేపీ 165 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 58 స్థానాల్లోనే గెలిచింది. నాటి ఈ గెలుపుతో శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

క్రితంసారి బీజేపీ 2008 కంటే ఎక్కువ సీట్లు సాధించింది. అయితే 2003లో వచ్చిన 173 సీట్ల కంటే మాత్రం 8 స్థానాలు తక్కువగా వచ్చాయి. ఆయినా వరుసగా మూడోసారి గెలవడం సామాన్యమైన విషయం కాదు. అదే సమయంలో 2008 కంటే కాంగ్రెస్ 13 స్థానాలు తక్కువగా గెలుచుకుంది. 2008లో 71 సీట్లు వస్తే క్రితంసారి 58కి పడిపోయాయి.

2003, 2008, 2013లో బీజేపీ వరుసగా గెలిచిన సీట్లు 173, 143, 165. కాంగ్రెస్ పార్టీ అదే క్రమంలో గెలిచిన సీట్లు 38, 71, 58.

2013లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. బీజేపీ 44.88 శాతం రికార్డ్ ఓట్ షేర్ సాధించింది. 2003లో 42.5 శాతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి 2013లో 3.97 శాతం ఓట్ల శాతం పెరిగింది. 2013లో బీజేపీ 165 సీట్లు గెలిచి 44.88% ఓట్లు, కాంగ్రెస్ 58 సీట్లు గెలిచి, 36.38% ఓట్లు, బీఎస్పీ 04 స్థానాలు గెలిచి 6.29% ఓట్లు సాధించాయి. ఎన్సీపీ, ఎస్పీ, సీపీఐలు ఒకటి కంటే తక్కువ ఓట్లు సాధించి, ఒక్క సీటును గెలుచుకోలేకపోయాయి.

2013లో ప్రచారం

2013లో బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లింది. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ నుంచి జ్యోతిరాధిత్య సిందియా కీలకంగా పని చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పలు ర్యాలీలలో పాల్గొన్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఎన్నికల్లో 3డీ వర్చువల్ లైవ్ టెక్నాలజీ ద్వారా ప్రచారం చేశారు. ఒకచోట ప్రచారం చేసి, తెరల ద్వారా పలుచోట్ల ఉపయోగించుకుంటారు. అంతకుముందు 2012లో నరేంద్ర మోడీ కూడా గుజరాత్‌లో ఇలాగే ప్రచారం చేశారు. ట్విట్టర్, సోషల్ మీడియాలలో జోరుగా ప్రచారం చేసారు. వీటి ద్వారా యువతను, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారిని ఆకట్టుకున్నారు.

2013లో శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలిచారు. విధిషా, బుధ్హిన్‌ల నుంచి పోటీ చేశారు. బుధ్హిన్‌లో 84,805 ఓట్లతో గెలిచారు. ఇది మధ్యప్రదేశ్‌లో రెండో హయ్యెస్ట్ మార్జిన్. అప్పుడు కాంగ్రెస్ నేత మహేంద్ర సింగ్ చౌహాన్ పైన గెలిచారు. అదే సమయంలో విదిషలో మాత్రం కాంగ్రెస్ నేత శషాంక్ భార్గవ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. ఇక్కడి నుంచి 16,996 ఓట్లతో గెలిచారు.

2013లో కాంగ్రెస్ ఓడిపోయిన అనంతరం బాధ్యతను జ్యోతిరాధిత్య సింధియా తీసుకున్నారు. ఓటమికి తనది బాధ్యత అన్నారు. అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.

Recalling 2013 Madhya Pradesh polls: Chouhan becomes CM for 3rd time, Congress puts up abysmal show

2018లో సవాళ్లు

బీజేపీ మధ్యప్రదేశ్‌లో వరుసగా మూడుసార్లు అధికారంలో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ వరుసగా సీఎం అవుతున్నారు. అయితే ఇప్పుడు చౌహాన్ ముందు సవాళ్లు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా వరుసగా మూడుసార్లు గెలిచినందు వల్ల ప్రభుత్వ వ్యతిరేకత. శాంతిభద్రతలు, రైతుల ఆందోళన, అత్యాచారాలు తదితర సమస్యలు బీజేపీ ముందు ఉన్న సవాళ్లు. అలాగే పవర్, నీటి సమస్య కూడా పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో వీటిని అధిగమించి ప్రజలను మెప్పిస్తారా లేక కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగిస్తారా చూడాలి.

మధ్యప్రదేశ్ గురించి..

రాజధాని - భోపాల్
జిల్లా - 52
అసెంబ్లీ స్థానాలు - 230
మొత్తం జనాభా - 7.2 కోట్లు
పట్టణ జనాభా - 2 కోట్లు
గ్రామీణ జనాభా - 5.2 కోట్లు
డీజీపీ (2018-19) - రూ.8.26 లక్షల కోట్లు
అక్షరాస్యత (2011) - 72.60%
సెక్స్ రేషియో(2011) - 931
ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ - బీజేపీ
మొత్తం ఓటర్లు - 5,03,34,260
పోలింగ్ స్టేషన్లు - 65,341

మధ్యప్రదేశ్‌లో జనాభా ఇలా

హిందువులు - 66,007,121 - 90.89%
ముస్లీంలు - 4,774,695 - 6.57%
ఇతర మతస్తులు - 599,594 -0.83%
జైనులు - 567,028 - 0.78%
బౌద్ధులు - 216,052 - 0.30%
క్రైస్తవులు - 213,282 - 0.29%
సిక్కులు - 151,412 - 0.21%
ఇతరులు - 97,625 - 0.13%

English summary
With polling for the 230 seats Madhya Pradesh assembly set to be held tomorrow, it is worth recalling what happened in the previous 2013 elections in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X