వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

40 శాతం పెరగనున్న జియో రిచార్జ్ రేట్లు... అదే బాటలో ఐడియా-వోడాఫోన్, ఎయిర్ టెల్ కంపనీలు

|
Google Oneindia TeluguNews

టెలికాం కంపనీలు... వినియోగదారుల నెత్తిన భారం వేయడానికి సిద్దమయ్యాయి. మూకుమ్మడిగా కంపనీలు రెండు మూడు రోజుల్లో కొత్త రేట్లు, ప్లాన్లతో వినియోగదారులను హడలెత్తించేందుకు సిద్దమయ్యాయి. ఇన్నాళ్లు అతి చౌకగా ప్లాన్‌లను అందించిన జియో మిగతా నెట్‌వర్క్స్‌ను కుదేలు చేసింది. దీంతో వినియోగదారులు జియో నెట్‌వర్క్‌కు మారారు. అయితే తాజాగా జియో తన ప్లాన్స్ రేట్స్‌ను పెంచేందుకు సిద్దమైంది. వాటి ధరలను పెంచుతున్నట్టు కంపనీ ప్రతినిధులు ప్రకటించారు.

జీయో ఎంటర్‌తో విప్లవాత్మక మార్పులు

జీయో ఎంటర్‌తో విప్లవాత్మక మార్పులు

దేశంలోకి జియో నెట్ వర్క్ వచ్చిన తర్వాత మొబైల్ వినియోగదారులు విపరీతంగా పెరిగిపోయారు. వాయిస్‌కాల్స్ నుండి డాటా వినియోగించే వరకు జీయో ఇతర వినియోగదారులకు చేరువయింది. ఈనేపథ్యంలోనే నెట్‌వర్క్స్‌కు పోటి ఇచ్చి వినియోగదారులకు చౌకగా ప్లాన్‌లు తీసుకువచ్చింది. దీంతో ఇన్నాళ్లు ఇతర నెట్‌వర్క్స్ ఎంతగా వినియోగదారుల నుండి డబ్బులు గుంజాయో అర్థమయ్యోలా పలురకాల ప్లాన్‌లు తీసుకువచ్చింది.

అన్ని నెట్‌వర్క్స్ ధరలు పెంపు

అన్ని నెట్‌వర్క్స్ ధరలు పెంపు

మారుతున్న ప్రభుత్వ విధానాలతో పాటు టెలికాం కంపనీలు సైతం వినియోగదారుల నెత్తిన భారం వేయడానికి సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలోనే జియోతో పాటు వోడాఫోన్ , ఐడియాలు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించాయి. అయితే జియో కంటే ముందే వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లు డిసెంబర్ మూడు నుండి 42 శాతం రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇక జియో సైతం వాటిబాట పట్టింది.

40 శాతం మేర పెరగనున్న టెలికాం ధరలు

40 శాతం మేర పెరగనున్న టెలికాం ధరలు

సెల్‌ఫోన్ వినియోగాదారుల్లో టెలికాం కంపనీలు మరోసారి విరుచుకుపడుతున్నాయి. ఇన్నాళ్లు ప్రజలకు ఫోన్ల వాడకాన్ని విపరీతంగా అలవాటు చేసిన కంపనీలు..ప్రస్తుతం అవి వాటి నష్టాలతో పాటు లాభాలను రాబట్టుకునేందుకు నిర్ణయించాయి. ఈనేపథ్యంలోనే జియో వాయిస్, మరియు డాటా చార్జీలను 40 శాతంమేర ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈపెరిగిన ధరలు డిశంబర్ ఆరు నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు. ధరల పెరుగుదలతో పాటు వినియోగదారులకు అదనపు ప్రయోజనాలకు కూడ అందిస్తున్నట్టు కంపనీ ప్రతినిధులు ప్రకటించారు.

ఎయిర్‌టెల్, ఐడియా వోడాఫోన్, జీయో నెట్‌ వర్క్స్‌

ఎయిర్‌టెల్, ఐడియా వోడాఫోన్, జీయో నెట్‌ వర్క్స్‌


ఇక వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కంపనీలు కూడ డిసెంబర్ మూడు నుండి ధరలు పెంచుతున్నట్టు ఆదివారం ప్రకటించాయి. పెంచిన ధరలను మరో రోజుల నుండే అమల్లోకి తీసుకురానున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఈనేపథ్యంలోనే మొబైల్‌ కాల్స్‌, డేటా చార్జీలను టెలికాం ఆపరేటర్‌ వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ప్రీపెయిడ్‌ విభాగంలో 2, 28, 84, 368 రోజుల వాలిడిటీతో కూడిన ప్లాన్‌లపై చార్జీలను పెంచనున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత ప్లాన్‌లతో పోలిస్తే తాజా ప్లాన్‌లు దాదాపు 42 శాతం మేరకు పెరగనున్నాయని కంపనీ తెలిపింది.

English summary
Jio, Vodafone Idea, Airtel recharge plans could become 40 per cent more expensive on December 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X