వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏ నిరసనలు: నష్టాన్ని వారి నుంచే వసూలు చేస్తాం: రైల్వే బోర్డ్ ఛైర్మన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు, విధ్వంసం వల్ల భారతీయ రైల్వేకు రూ. 80 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిని గుర్తించి వార వారి నుంచి ఆ మొత్తం వసూలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

citizenship act: ఆందోళనకారుల విధ్వంసంతో రైల్వేకు భారీ నష్టం, ఎన్ని కోట్లంటే..?citizenship act: ఆందోళనకారుల విధ్వంసంతో రైల్వేకు భారీ నష్టం, ఎన్ని కోట్లంటే..?

సీఏఏ, ప్రతిపాదిత ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ఇటీవల దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎక్కువగా రైల్వే ఆస్తులు ధ్వంసమయ్యాయి. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన పెద్దఎత్తున ఆందోళనకారులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఐదు రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టారు. ఓ రైలును కూడా పూర్తిగా దగ్ధం చేశారు.

Recovery to be made from those who damaged rail property during CAA protests: Railway Board chairman

ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. అయితే, యూపీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేసిన వారి పట్ల అక్కడి కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే ప్రకటించింది. ధ్వంస చేసిన వారి నుంచే ఆ మొత్తాన్ని వసూలు చేస్తామని చెప్పింది.

ఇప్పటికే మొత్తం 498 మందిని గుర్తించి వారికి నోటీసులు కూడా జారీ చేసింది. విధ్వంసానికి పాల్పడిన వారి ఆస్తులను వేలం వేసి నష్టాన్ని పూడుస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. తాజాగా, రైల్వే బోర్డ్ ఛైర్మన్ కూడా విధ్వంసకారుల నుంచే నష్టాన్ని భర్తీ చేస్తామని చెప్పడం గమనార్హం.

కాగా, ఆందోళనకారులు విధ్వంసం కారణంగా భారత రైల్వేకు రూ. 88 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఆందోళనకారులు చాలా చోట్ల రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టారు. రైల్వ ట్రాక్‌లను ధ్వం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రైల్వేకు తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

తూర్పు రైల్వే జోన్ పరిధిలో రూ. 72కోట్ల విలువ చేసే రైల్వే ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇక ఆగ్నేయ రైల్వే జోన్‌లో రూ. 13కోట్లు, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ జోన్‌లో రూ. 3 కోట్ల ఆస్తులు ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఈ మేరకు రైల్వే అధికారులు తెలిపారు.

English summary
Railway property worth Rs 80 crore was damaged during protests across the country against the amended citizenship law and recovery will be made from those found involved in arson and violence, Railway Board Chairman Vinod Kumar Yadav said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X