ఏటీఎంలో చోరీలకు కోచింగ్ సెంటర్ పెట్టాడు
న్యూఢిల్లీ: రెండు వారాలలో ఏటీఎం కేంద్రాలలో నగదు ఏలా చోరీ చెయ్యాలో చెప్పే కోచింగ్ ఇచ్చి బయటకు పంపించే కోచింగ్ సెంటర్ భారత దేశంలో ఒకటి ఉందని తెలుసా ? అది దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇలాంటి కోచింగ్ సెంటర్ ఉందని పోలీసు అధికారులు గుర్తించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులతో పాటు కోచింగ్ సెంటర్ ఉన్న ప్రాంతంలోని వారు పెద్ద షాక్ కు గురైనారు. ఉత్తర ప్రదేశ్ లోని ఖరగ్ పూర్ కు చెందిన రాజీవ్ సహానీ (26) ఢిల్లీ యూనివర్శిటిలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. తరువాత సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు.
రెండు వారాలలో ఇంగ్లీష్ నేర్పించే కోచింగ్ సెంటర్లు ఇతనిని ఆకర్షించాయి. ఏటీఎం కేంద్రాలలో నగదు చోరీ చెయ్యడానికి అతను ప్లాన్ వేశాడు. అందుకోసం మనుషులు అవసరం అయ్యారు. చురుకైన విద్యార్థులను గుర్తించి వారిని అనేక విధాలుగా ప్రలోభపెట్టాడు.
తరువాత వారికి థియరీ క్లాస్ లు చెప్పాడు. తర్వాత ఏటీఎం కేంద్రాలకు తీసుకు వెళ్లి ప్రాక్టికల్ క్లాసులు బోధించాడు. మహిళలు, వృద్దులకు సహాయం చేస్తున్నట్లు నటించాలని సూచించాడు. వారి ఏటీఎం కార్డులు యంత్రంలో పెట్టి పిన్ నెంబర్ నొక్కిన సమయంలో ఓ మైక్రోచిప్ లోపలికి పంపించాలని చెప్పాడు.

ఆ సందర్బంలో స్క్రీన్ బ్లాక్ అయిపోతుందని, వారిని ఇక్కడ యంత్రం పని చెయ్యడం లేదని, మీరు వేరే ఏటీఎం కేంద్రానికి వెళ్లి నగదు డ్రా చేసుకోవాలని చెప్పాలని సూచించాడు. వారు వెళ్లిన తరువాత మైక్రోచిప్ తీసి వేసి నగదు డ్రా చేసుకోవాలని శిక్షణ ఇచ్చాడు.
ఈ విదంగా విచ్చలవిడిగా డబ్బు సంపాధించాడు. చోరీలు చేసిన వారికి వాటాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. ఒకప్పుడు చిల్లిగవ్వ లేని రాజీవ్ హోండా సిటి కారులో తిరగడం మొదలు పెట్టాడు. ఒక వ్యక్తి ఈ విధంగా చోరీ చేస్తు చిక్కిపోడంతో రాజీవ్ అసలు రంగు బయటపడింది.
2011లో ఒక చోరీ కేసులో రాజీవ్ జైలుకు వెళ్లాడని పోలీసులు అన్నారు. ఆ సందర్బంలో జైలులో ఉన్న ఒక ఖైదీ ఏటీఎం కేంద్రాలలో చోరీలు ఎలా చెయ్యాలి అని రాజీవ్ కు చెప్పాడు. అక్కడే ప్లాన్ వేసుకుని బయటకు వచ్చిన రాజీవ్ సహానీ ఇప్పుడు అక్కడికే చేరాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications