చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్రచందనం స్మగ్లర్ సౌందర రాజన్ రిమాండ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చిత్తూరు పోలీసులు ఏప్రిల్ 19న అరెస్ట్ చేసిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సౌందర్ రాజన్‌ను అనేక న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ కోర్టులో హాజరు పర్చిన తర్వాత, కోర్టు అనుమతితో అక్కడి నుంచి గురువారం సౌందర్ రాజన్‌ను చిత్తూరుకు తీసుకొచ్చారు.

చిత్తూరు జిల్లా నారాయణవనం, గుడిపాల పోలీస్ స్టేషన్ల పరిధిలో సౌందర్‌రాజన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం చిత్తూరు కోర్టుకు హాజరు పర్చగా మూడవ అదనపు న్యాయస్థానం జడ్జి జస్టిస్ రాఘవేంద్ర రిమాండుకు పంపాలని ఆదేశించారు. మే 5 వరకు(14రోజులపాటు) అతనికి కోర్టు రిమాండ్ విధించింది. కేసులు విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో సౌందర్‌రాజన్‌ను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సౌందర రాజన్‌పై 10 కేసులు నమోదయ్యాయి. చెన్నైకు చెందిన సౌందర్‌రాజన్(33) రెండేళ్లకిందట కూలీగా సంపాదన ప్రారంభించాడు. అనతి కాలంలో అంతర్జాతీయ బడా స్మగ్లర్‌గా ఎదిగాడు. పశ్చిమబెంగాల్, భూటాన్‌లో కేంద్రాలు ఏర్పాటుచేసుకుని విదేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడంలో అందెవేసిన చేయిగా నిలిచాడు. స్మగ్లింగ్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించాడు.

కాగా, పక్కా సమాచారంతో చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో ఆరు బృందాలుగా పశ్చిమబెంగాల్‌లోని సౌందర్‌రాజన్ స్థావరాలపై ఏప్రిల్ 19వ తేదీన మెరుపు దాడులు చేశారు. మూడు గోడౌన్‌లను సీజ్‌చేశారు. వీటిలో రూ. 20కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలున్నట్టు పోలీసులు చెప్పారు. అక్కడ కోర్టుకు హాజరు పర్చగా ప్రభుత్వ అనుమతితో ఈ ఎర్రచందనాన్ని చిత్తూరుకు తరలించారు.

స్మగ్లర్ సౌందర రాజన్

స్మగ్లర్ సౌందర రాజన్

చిత్తూరు పోలీసులు ఏప్రిల్ 19న అరెస్ట్ చేసిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సౌందర్ రాజన్‌ను అనేక న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ కోర్టులో హాజరు పర్చిన తర్వాత, కోర్టు అనుమతితో అక్కడి నుంచి గురువారం సౌందర్ రాజన్‌ను చిత్తూరుకు తీసుకొచ్చారు.

స్మగ్లర్ సౌందర రాజన్

స్మగ్లర్ సౌందర రాజన్

చిత్తూరు జిల్లా నారాయణవనం, గుడిపాల పోలీస్ స్టేషన్ల పరిధిలో సౌందర్‌రాజన్‌పై పలు కేసులు నమోదయ్యాయి.

స్మగ్లర్ సౌందర రాజన్

స్మగ్లర్ సౌందర రాజన్

ఈ నేపథ్యంలో గురువారం చిత్తూరు కోర్టుకు హాజరు పర్చగా మూడవ అదనపు న్యాయస్థానం జడ్జి జస్టిస్ రాఘవేంద్ర రిమాండుకు పంపాలని ఆదేశించారు.

స్మగ్లర్ సౌందర రాజన్

స్మగ్లర్ సౌందర రాజన్

మే 5 వరకు(14రోజులపాటు) అతనికి కోర్టు రిమాండ్ విధించింది. కేసులు విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో సౌందర్‌రాజన్‌ను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతర్జాతీయ బడాస్మగ్లర్ గంగిరెడ్డితో పాటు సౌందర్‌రాజన్‌కు సంబందం ఉన్నట్లు పోలీసు విచారణలో తేలింది. కాగా, పోలీసుల అదుపులో ఉన్న సౌందర్యరాజన్ నోరు విప్పితే తమిళనాడు, ఆంద్రప్రదేశ్‌లోని పలువురు రాజకీయ నాయకులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

English summary
The Chittoor police on Thursday evening produced notorious red sanders smuggler Soundara Rajan before the III Additional District Magistrate court in Chittoor town, which remanded him till May 5. Police later shifted him to the Chittoor sub-jail amid tight security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X