వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమా కోసం శ్రద్దాంజలి పోస్టర్... వారం తర్వాత నిజంగానే శ్రద్దాంజలి....!

|
Google Oneindia TeluguNews

అదృష్టం వరించిందా....? విధి వక్రికరించిందా... తేల్చుకోలేని అంశం ఇది... కామేడి కోసం ఓ వ్యక్తి చనిపోయినట్టు పోస్టర్లు వేయించుకున్నాడు.. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన బంధువులతోపాటు స్నేహితులు కూడ అయ్యో.. అంటూ ఆయన ఇంటికి చేరారు..కాని ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆ పోస్టర్ వేయించానని తెలవడంతో అంతా కూల్‌గా వెళ్లిపోయారు...అయితే అదే పోస్టర్ తిరిగి వారం రోజుల గ్యాప్‌లో వెలిసింది..ఇక అప్పుడు కూడ అదిగో పులి కథలా అనుకున్నారు. కాని నిజంగానే సినిమా నటుడ్ని మృత్యువు కబలించిన విషాద సంఘటన తమిళనాడులో విషాదాన్ని నింపింది.

ఎక్కువ కాలం నిలవని సినిమా సంతోషం

ఎక్కువ కాలం నిలవని సినిమా సంతోషం

సినిమాలో చాన్స్‌ అంటే మాటలు కాదు, ఆ ఒక్క చాన్స్‌కోసం అనేక రోజుల పాటు తిండితిప్పలు లేని రోజుల సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టోరీలు సినిమాల్లోనే చూశాం..ఇలాంటీ సంధర్భంలోనే తమిళనాడు తుత్తుకూడి జిల్లా కాయల్‌పట్టినంకు చెందిన అర్‌ గోపాల్ అనే వ్యక్తి ఓ టెంట్‌హౌజ్ నడుపుతూ తన వ్యాపారానికి సంబంధించి విన్నూత్న ప్రచారం నిర్వహించాడు. ఈ దెబ్బతో ఆయనకు సినిమాలో విలన్ అవకాశం వచ్చింది. దీంతో ఎగిరి గంతేసిన గోపాల్ అందులో నటించాడు.

సినిమా ప్రమోషన్ కోసం శ్రద్దాంజలి పోస్టర్

సినిమా ప్రమోషన్ కోసం శ్రద్దాంజలి పోస్టర్


అయితే సినిమా కథలో భాగంగా గోపాల్ చనిపోయిన తర్వాత నటించే శ్రద్దాంజలి ఘటించే సీన్ ఒకటి ఉంది. దీంతో ఆ సీన్‌ పోస్టర్‌నే గోపాల్ తన ప్రమోషన్‌గా వాడుకున్నాడు. వాల్‌పోస్టర్ల నుండి ఫేస్‌బుక్‌ దాకా ప్రచారం చేశాడు. అయితే ట్విస్ట్ ఏంటంటే గోపాల్ సినిమాలో నటించినట్టు తెలియని చాలమంది బంధువులు, సన్నిహితులు పోస్టర్‌ను చూసి ఏకంగా ఇంటికి వచ్చి వెళ్లారు. నిక్షేపంలా ఇంట్లో ఉన్న గోపాల్ చూసి ఖంగుతిన్న సన్నిహితులు... అదంతా సినిమా ప్రమోషన్ కోసం అని చెప్పడంతో అంతా సంతోషంగా తిరిగి వెళ్లారు.

నిజంగానే చనిపోయినా గోపాల్

నిజంగానే చనిపోయినా గోపాల్


కాని దురదృష్టం ఏమిటంటే తాజాగా శనివారం మరోసారి అలాంటీ పోస్టర్లు సోషల్ మీడియాతోపాటు నగరంలో చక్కర్లు కోట్టాయి..అయితే ఇది కూడ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే అంతా భావించారు. కాని సినిమా పోస్టర్‌కు ఇతర పోస్టర్‌కు తేడా గమనించిన కొంతమంది మాత్రం ఫోన్ చేస్తే అసలు విషయం బయటపడింది. చనిపోయినట్టు పోస్టర్ వేసుకున్న వారంలోనే నిజంగానే గోపాల్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఈ వార్త తమిళనాడులో దావానంలా వ్యాపించినట్టు పలు మీడియాలు కథనాలు రాశాయి.

English summary
Good luck...or fate has been twisted ...One person Posted on Facebook of his death posters for cinema promotion but ofter one week he really died
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X