వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల సంక్షేమం కోసం సంస్కరణలు ,ఎంఎస్పీ పెంచటంలో ఎన్‌డీఏదే హిస్టరీ : ప్రధాని మోదీ

|
Google Oneindia TeluguNews

ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోడ్డెక్కిన రైతులు ఆందోళనలతో తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. జాతీయ రహదారుల దిగ్బంధం , రైల్ రోకో కార్యక్రమాలతో ప్రస్తుతం ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.

వ్యవసాయ బిల్లులపై రైతు సంఘాల పోరు .. సెప్టెంబర్ 25న భారత్ బంద్ .. వివిధ రాష్ట్రాల్లో ఇలా !!వ్యవసాయ బిల్లులపై రైతు సంఘాల పోరు .. సెప్టెంబర్ 25న భారత్ బంద్ .. వివిధ రాష్ట్రాల్లో ఇలా !!

రైతు సంక్షేమం కోసమే వ్యవసాయ బిల్లులు ప్రవేశపెట్టామని చెప్పారు . రైతుల కోసం ఎంఎస్‌పి పెంచడంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు ప్రధాని మోదీ. రైతులు, కార్మికుల పేరిట దేశంలో ఇప్పటివరకు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, కాని వారికోసం ఇప్పుడు వరకు ఏం చేయలేదని, రైతుల కోసం వారు చేసిన వాగ్దానాలు అలాగే మిగిలిపోయాయని మోదీ అభిప్రాయపడ్డారు. అలా కాకుండా రైతుల సంక్షేమం కోసం సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదే అని మోదీ తేల్చిచెప్పారు.

Reforms for the welfare of farmers, NDA history in raising MSP : PM Modi

.

గత ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించ లేదని, గత ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు రైతులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చడానికి నిరంతరం ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే రైతుల సంక్షేమం కోసం సంస్కరణలు ప్రవేశ పెట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా రైతులను బ్యాంకులతో అనుసంధానించడానికి, బ్యాంకుల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి ప్రయత్నాలు చేసిందన్నారు .

పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 10 లక్షల మంది రైతులకు రూ .1 లక్ష కోట్లకు పైగా అందించిందని చెప్పారు . కిసాన్ క్రెడిట్ కార్డులను ఎక్కువ మంది రైతులకు అందించడమే లక్ష్యంగా పని చేశామని, తద్వారా వారు సులభంగా రుణాలు పొందవచ్చునని పిఎం మోదీ తెలిపారు.
స్వాతంత్రం పొందిన తరువాత దశాబ్దాలుగా రైతుల పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాలు నినాదాలు మారుమ్రోగాయి అని, అయితే అవన్నీ నినాదాలుగా మాత్రమే మిగిలిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతుల పేరుతో పెద్ద పెద్ద మ్యానిఫెస్టోలు రాసిన చరిత్ర ఉందని పేర్కొన్న మోదీ ప్రస్తుతం దేశంలోని రైతులకు ఏం కావాలో తెలుసు అంటూ పేర్కొన్నారు. .

English summary
PM Modi says that BJP-led NDA govt has created history in its increase of MSP for farmers .Governments were formed in name of farmers, workers but all they got was jumbled web of promises, laws. Hollow slogans were given in favour of farmers, labourers for many decades since Independence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X