వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కల్లోలం- 24 గంటల్లో 2.86 లక్షల కేసులు : 19.59 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

దేశ వ్యాప్తంగా కరనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గతం రోజు కంటే స్వల్ప సంఖ్యలో కేసులు తగ్గినా.. తీవ్రత మాత్రం తగ్గటం లేదు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేసారు. అనేక రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అధికంగా కేసులు నమోదు అయిన రాష్ట్రాల్లో స్వల్పంగా కేసులు తగ్గినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక, దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో తాజాగా 2,86,384 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 573 మంది మరణించారు. 3,06,357 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

పెరుగుతున్న పాజిటివిటీ రేటు

పెరుగుతున్న పాజిటివిటీ రేటు

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 19.59 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,03,71,500 కాగా, మొత్తం మరణాలు 4,91,700 గా నమోదయ్యాయి. ఇక.. యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472గా నిర్దారించారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,76,77,328గా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో పాటుగా ప్రపంచ దేశాల్లోనూ కరోనా కల్లోలం ఆగటం లేదు. అమెరికాలో కొత్తగా 5,33,313 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 3,143 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7.4 కోట్లు దాటింది.ఫ్రాన్స్​లో ఒక్కరోజే 4,28,008 కేసులు వెలుగుచూశాయి. మరో 258 మంది చనిపోయారు.ఇటలీలో 1,67,206 కొత్త కేసులు బయటపడగా.. 362 మంది మరణించారు.

ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం

ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం

బ్రెజిల్​లో కొత్తగా 2,19,878 మందికి వైరస్​ సోకగా.. 606 మంది చనిపోయారు.అర్జెంటీనాలో తాజాగా 88,503 కరోనా కేసులు బయటపడగా.. 316 మంది బలయ్యారు.జర్మనీలో 1,88,759 వేల మందికి వైరస్ సోకింది. మరో 184 మంది మృతి చెందారు.బ్రిటన్​లో మరో 1,02,292 వేల మంది వైరస్ బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. గత కొద్దిరోజులుగా రోజూ 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఊరటనిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనూ

తెలుగు రాష్ట్రాల్లోనూ

గడిచిన 24 గంటల్లో 46,143 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 13,618 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారిన పడి తాజాగా తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరేసి మృతి చెందగా, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలలో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో 3,801 మందికి మహమ్మారి సోకినట్టు నిర్ధరణైంది. ఒక్క జీహెచ్​ఎంసీ పరిధిలోనే 1,570 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం కొవిడ్​ మరణాల సంఖ్య 4,078కి చేరింది.

English summary
India reported less than three lakh daily Covid-19 cases for the third consecutive day, with 2,86,384 fresh cases and 573 deaths in the past 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X